పెళ్లి చేసుకున్నాము ఓ సర్టిఫికెట్ ఇవ్వండి అంటున్న నెత్తి నోరు మొత్తుకుంటున్నా అధికారులు మాత్రం స్పందించడంలేదు సరికాదు కదా.. విదేశాల్లో ఉన్న ఆమెను పలుసార్లు కావాలనే తమ కార్యాలయానికి తిప్పుతున్నారు. అయితే ఇదంతా అధికారులకు అమ్యామ్యాలకు అలవాటు పడిన సిబ్బంది వాటిని ఇవ్వకపోవడంతో పాటు ఉన్నతాధికారులు చెప్పి ఆ లంచం అడిగిన ఉద్యోగికి పనిష్మెంట్ కూడా ఇప్పించడంతో అమెకు అసలు తిప్పలు మొదలయ్యాయి. అయితే ఈ మహిళ స్టోరీ ఓ సినిమానే తలపించే విధంగా ఉంది..
వివవరాల్లోకి వెళితే...కెనెడాలో నివసిస్తున్న నవనీత్ కౌర్ అనే మహిళ మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని యువకునితో గత సంవత్సరం వివాహం అయింది. దీంతో తమ మ్యారేజీ సర్టిఫికెట్ కోసం ధరఖాస్తు చేసి వెంటనే చేశారు. అయితే ఆమెకు ఇప్పటి వరకు అధికారులు ఇవ్వలేదు సరికాదా.. ఇంకా ఏవో సర్టిఫికెట్స్ తెమ్మని చెబుతున్నారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పలు విషయాలను వెల్లడించింది.
Khammam trs : ఖమ్మం జిల్లా తెరాసలో మళ్లీ ఫ్లెక్సీల లొల్లి.. ఆ నేతలిద్దరి మధ్య ముదురుతున్న వివాదం
పెళ్లి తర్వాత కెనెడాకు వెళ్లిన నవనీత్ కౌర్ మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఇండియాకి మూడుసార్లు వచ్చినట్టు చెప్పింది. అధికారులు అడిగిన అన్ని పత్రాలు ఇవ్వడంతో పాటు కెనడా ఎంబసీ నుండి కూడా సర్టిఫికెట్ తెచ్చి ఇచ్చినట్టు చెప్పింది. ఇలా ఇండియాకు రావడం కోసం తొమ్మిది లక్షల రూపాయలను ఖర్చు పెట్టామని చెప్పింది. కాగా ఇదే సర్టిఫికెట్ కోసం మొదట్లో ఓ క్లర్క్ లంచం అడగడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో క్లర్క్‌ను అధికారులు మందలించారు. ఆ తర్వాత ఎవరు డబ్బులు అడగడం లేదు కాని సర్టిఫికెట్స్ పేరుతో తిప్పుతున్నారని ఆమె బహిరంగంగా ప్రకటించింది. దీంతో ఆమే చేసిన వ్యాఖ్యలు కాస్తా వైరల్ గా మారాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రంగంలో దిగాడు. ఆమె ఫిర్యాదుపై విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తానని వెల్లడించాడు.
Forgery case : కోర్టునే బురిడి కొట్టిస్తున్న గ్యాంగ్.... ఐదుగురు సభ్యుల అరెస్ట్..!
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Marriage, National News