Home /News /national /

NIA TO FILE CHARGESHEET ON PULWAMA TERROR ATTACK AFTER 18 MONTHS OF INCIDENT AK

Pulwama Terror Attack: పుల్వామా దాడి ఘటనలో సూత్రధారి అతడే.. ఛార్జ్‌షీట్ సిద్ధం చేసిన ఎన్ఐఏ

పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రాంతం(ఫైల్ ఫోటో)

పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రాంతం(ఫైల్ ఫోటో)

Pulwama Terror Attack: ఈ ఘటనకు కారకులైన 20 ఉగ్రవాదుల జాబితాలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌, రవూఫ్ అజ్గర్ వంటి వారిని చేర్చినట్టు తెలుస్తోంది.

    ఏడాదిన్నర క్రితం 40 మంది జవాన్లను బలి తీసుకున్న పుల్వామా దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛార్జ్‌షీట్ సిద్ధం చేసింది. ఈ ఘటనకు కారకులైన 20 ఉగ్రవాదుల జాబితాలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌, రవూఫ్ అజ్గర్ వంటి వారిని చేర్చినట్టు తెలుస్తోంది. జమ్మూలోని ఎన్ఐఏ కోర్టులో ఈ రోజు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. 18 నెలల సుదీర్ఘ దర్యాప్తు తరువాత ఎన్ఐఏ 5 వేల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్ వేయనుంది. పలువురు నిందితుల నుంచి ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది. ఉగ్రవాదులకు అంత పెద్ద మొత్తంలో ఆయుధాలు ఎలా వచ్చాయనే దానిపై ఎన్ఐఏ దగ్గర సమాధానం లేదనే వాదనలు వినిపించాయి.

    అయితే ఈ ఛార్జ్‌షీట్‌లో ఇందుకు సంబంధించిన సమాధానాలు ఉంటాయని తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి దాదాపు 20 కేజీల ఆర్‌డీఎక్స్ పేలుడు సామాగ్రిని పేలుడు కోసం తెచ్చినట్టు ఓ అధికారి తెలిపారు. ఫిబ్రవరి 19, 2019న అదిల్ అహ్మద్ దార్ అనే ఉగ్రవాది కారు ద్వారా సీఆర్పీఎఫ్ ట్రక్కును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Pulwama Terror Attack

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు