• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • NIA TAKES OVER CASE OF VEHICLE LADEN WITH EXPLOSIVES FOUND NEAR MUKESH AMBANIS RESIDENCE IN MUMBAI BA

ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కారులో పేలుడు పదార్థాల కేసు ఎన్ఐఏకి అప్పగింత

ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కారులో పేలుడు పదార్థాల కేసు ఎన్ఐఏకి అప్పగింత

ముఖేష్ అంబానీ నివాసం వద్ద పార్క్ చేసిన కారు, అందులో జిలెటిన్ స్టిక్స్

భారత బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో కారులో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారించనుంది.

 • Share this:
  భారత బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో కారులో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారించనుంది. ఈ మేరకు ఎన్ఐఏ అధికార ప్రతినిధి వెల్లడించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను టేకప్ చేస్తున్నట్టు ఆ అధికార ప్రతినిధి చెప్పారు. తాజాగా కేసు ఎన్ఐఏకి ఇవ్వడంతో వారు కేసును రీ రిజిస్టర్ చేయనున్నారు. ఫిబ్రవరి 25న ముంబైలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఏరియాలో ముఖేష్ అంబానీ ఇల్లు ఆంటాలియా వద్ద స్కార్పియో కారు కలకలం రేగింది. ఫిబ్రవరి 25న ఈ ఘటన జరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఆ కారు ఫిబ్రవరి 18వ తేదీన ఐరోలి - ములుంద్ బ్రిడ్జి వద్ద చోరీకి గురైనట్టు గుర్తించారు. ఈ క్రమంలో కేసు విచారణ జరుపుతుండగా, ఆ కారు ఓనర్ హిరేన్ మన్సుక్ గత శుక్రవారం (మార్చి 5)న ధానేలో ఓ కాలువ ప్రవాహంలో మృతిచెంది కనిపించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: