హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు.. ఎన్ఐఏ ముమ్మర సోదాలతో కలకలం

హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు.. ఎన్ఐఏ ముమ్మర సోదాలతో కలకలం

ప్రతీకాత్మక చిత్రం

NIA raids in hyderabad : బాసిత్‌ పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతితోనూ టచ్‌లో ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య కోసం సోషల్ మీడియా ద్వారానే ఉగ్రవాదులతో అతను సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు.

  • Share this:
    హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్ పల్లి పరిధిలోని శాస్త్రిపురంలోని కింగ్స్ కాలనీలో ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ) బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున అక్కడ మోహరించిన ఎన్ఐఏ బృందాలు.. 8 గ్రూపులుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. రెండేళ్ల క్రితం ఢిల్లీలో పట్టుబడిన నలుగురు ఐసిస్ సానుభూతిపరలు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్‌కు తెర వెనుక సూత్రధారి అయిన బాసిత్.. అతని అనుచరులు కింగ్స్ కాలనీలో ఉన్నారన్న సమాచారం మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్ఐఏ అధికారులు మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించారు. కేసు దర్యాప్తులో ఉన్న దశలో ఎలాంటి వివరాలు వెల్లడించలేమని తెలిపింది.

    కాగా, రెండేళ్ల క్రితం ఢిల్లీలో ఎన్ఐఏ అధికారులు నలుగురు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిని బాసిత్ అనే హైదరాబాద్ యువకుడు అక్కడికి పంపించాడు. ఐసిస్‌లో చేరి భారత్‌పై యుద్దం చేయాలని భావించిన బాసిత్.. మరికొంతమంది యువకులను ఆకర్షించాడు. అదే క్రమంలో ఢిల్లీలో ఓ ఆర్ఎస్ఎస్ నాయకుడిని హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. ఇందుకోసం కశ్మీర్ వేర్పాటు వాదుల నుంచి అతనికి సహకారం లభించింది. వేర్పాటువాదులు అతనికి ఏకె 47 గన్ అందించారు. గన్‌తో పాటు కొన్ని కెమికల్స్ ఇచ్చి నలుగురు యువకులను బాసిత్ ఢిల్లీ పంపించాడు. అయితే ఎన్ఐఏ అధికారులు కుట్రను చేధించి.. ఢిల్లీలో నలుగురిని అరెస్ట్ చేశారు.

    బాసిత్‌ పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతితోనూ టచ్‌లో ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య కోసం సోషల్ మీడియా ద్వారానే ఉగ్రవాదులతో అతను సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. కేసును విచారిస్తున్న ఎన్ఐఏ.. హైదరాబాద్‌లో బాసిత్, అతని అనుచరులను పట్టుకునేందుకు ఇప్పుడు సోదాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ సోదాల్లో కొత్త విషయాలేమైనా బయటపడుతాయా? అన్న ఉత్కంఠ నెలకొంది.

    First published: