Home /News /national /

NIA PROBING DAWOOD IBRAHIM SPECIAL UNIT AGAINST INDIA HIT LIST HAS POLITICIANS AND BUSINESSMEN PVN

Dawood Ibrahim : భారత్ లో మళ్లీ మతకల్లోలాలు,ఉగ్రదాడులకు దావూద్ భారీ స్కెచ్..ఇందుకోసం ఏకంగా

దావూద్ ఇబ్రహీం(ఫైల్ ఫొటో)

దావూద్ ఇబ్రహీం(ఫైల్ ఫొటో)

Dawood Ibrahim Special Unit Against India : దేశంలో వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు దావూద్ ఇబ్రహీం ప్లాన్ చేస్తున్నాడని, దీనికోసం దావూద్‌ ఓ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు NIA బహిర్గతం చేయడం సంచలనంగా మారింది. దావూద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ ఓ హిట్ లిస్ట్‌ను తయారు చేసిందని, అందులో ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నాయకుల పేర్లు ఉన్నట్టు వెల్లడించింది.

ఇంకా చదవండి ...
NIA Probing Dawood Special Unit : భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడి..పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నట్లు అనుమానిస్తున్న మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం మళ్లీ భారత్‌ లో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయ్యాడా? ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రముఖ రాజకీయ నేతలను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడా అనే ప్రశ్నలకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)అవుననే సమాధానం చెబుతోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు దావూద్ ఇబ్రహీం ప్లాన్ చేస్తున్నాడని, దీనికోసం దావూద్‌ ఓ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు NIA బహిర్గతం చేయడం సంచలనంగా మారింది. దావూద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ ఓ హిట్ లిస్ట్‌ను తయారు చేసిందని, అందులో ప్రముఖ వ్యాపారులు, రాజకీయ నాయకుల పేర్లు ఉన్నట్టు వెల్లడించింది. ఢిల్లీ, ముంబైలపై దావూద్ ఇబ్రహీం దృష్టి పెటినట్టు తెలిపింది

పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో దాడి చేసేందుకు దావూద్ గ్యాంగ్ ప్రణాళికలు రచిస్తున్నట్టు ఉగ్రదాడుల కుట్రకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) దావూద్ పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. పలు ప్రాంతాల్లో వివిధ మతాల మధ్య ఘర్షణలను సృష్టించాలని దావూద్ గ్యాంగ్ ప్రయత్నిస్తున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో దావూద్‌ ఇబ్రహీంతోపాటు అతడి అనుచరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) ఇటీవలే మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌ను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే.

ALSO READ Four Days Work: వారానికి నాలుగురోజులే ప‌ని.. త‌ర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవ‌చ్చు

ఉగ్రదాడుల కుట్రకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ)...జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సోపోర్‌, కుప్వారా, షోపియాన్‌, రాజౌరీ, బుద్గాం, గందర్‌బల్‌, రాజస్థాన్‌ లోని జోధ్‌ పుర్‌లో తనిఖీలు నిర్వహించింది. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న పలువురిపై నిఘా పెంచడంతో కీలక సమాచారం లభ్యమైందని తెలిపింది. ఈ సోదాల్లో అనేక విషయాలు బయటపడుతున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదుల కుట్ర కేసులో ఇప్పటికే 28 మంది నిందితులను అరెస్టు చేశామని వెల్లడించింది. దావూద్, డి కంపెనీ వ్యవహారంలో ప్రముఖ వ్యాపార వేత్తలు, కొద్దిమంది రాజకీయ నేతలు ఎన్​ఐఏ రాడార్​ లో ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు వేగవంతం అవుతున్న నేపథ్యంలో త్వరలో అనేక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దావూద్ ​తో కలిసి దేశంలో కుట్రలకు పాల్పడిన వ్యవహారంలో అనేకమంది రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో సంబంధాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ, మహారాష్ట్రలకు చెందిన కొందరు పెద్ద నాయకుల ఆదేశం మేరకే దావూద్ ఇబ్రహీం అనుచరులు అనేకమందికి సహాయం చేశారని అధికారిక వర్గాలు తెలిపాయి.ఉగ్రవాదులకు వ్యాపారవేత్తలు నిధులు సమకూర్చి, ఆ ముఠాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Blasts, India, Most Wanted Criminal, NIA, Terrorists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు