భారీ విధ్వంసానికి స్కెచ్.. 2 రాష్ట్రాల్లో 9 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్

ప్రస్తుతం 9 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ఇంకా చాలా మందే ఉండవచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాదుల విచారణలో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశముంది.

news18-telugu
Updated: September 19, 2020, 10:35 AM IST
భారీ విధ్వంసానికి స్కెచ్.. 2 రాష్ట్రాల్లో 9 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కుట్రపన్నింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వీరి కుట్ర భగ్నమైంది. అల్ ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రవాద ముఠా కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ప్రజలే లక్ష్యంగా పేలుళ్లకు కుట్ర చేసినట్లు నిఘా వర్గాల ద్వారా NIA (National Investigation Agency)కి సమాచారం అందింది. పక్కా సమాచారంతో శనివారం ఉదయం కేరళలోని ఎర్నాకుళం, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి 9 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఎర్నాకుళంలో ముర్షద్ హసన్, ఇయాకుబ్ బిశ్వాస్, ముషారఫ్ హుసేన్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన నజ్ముస్ షకీబ్, అబు సూఫియాన్, మైనుల్ మోండల్, లీ యీన్ అహ్మద్, అల్ మమున్ కమల్, అతితుర్ రెహమాన్ ఉన్నారు. వారి వద్ద నుంచి పలు డిజిటల్ సాధనాలు, పత్రాలు, జిహాదీ లిటరేటర్, పదునైన ఆయుధాలు, నాటు తుపాకులు, శరీర రక్షణ కవచాలను స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరిలో కొందరు ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అక్కడ తుపాకులు, బాంబుల తయారీకి వాడే ముడి పదార్థాలు, ఇతర ఆయుధాలను సేకరించాలని భావించారు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో దాడులు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 9 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ఇంకా చాలా మందే ఉండవచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాదుల విచారణలో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశముంది. వీరికి ఎవరు సహకరిస్తున్నారు? ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫండ్స్ ఎవరిస్తున్నారు? అనే దానిపై కూపీ లాగుతోంది ఎన్ఐఏ.
Published by: Shiva Kumar Addula
First published: September 19, 2020, 10:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading