• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • NHAI WORLD RECORD NATIONAL HIGHWAY AUTHORITY OF INDIA SETS LIMCA WORLD RECORD BY CONSTRUCTING 25 KM ROAD IN 18 HOURS NK

World Record: 18 గంటల్లో 25 కి.మీ. రోడ్డు... నేషనల్ హైవే అథార్టీ ప్రపంచ రికార్డ్

World Record: 18 గంటల్లో 25 కి.మీ. రోడ్డు... నేషనల్ హైవే అథార్టీ ప్రపంచ రికార్డ్

18 గంటల్లో 25 కి.మీ. రోడ్డు (image credit - twitter - nitin gadkari)

World Record: నిన్నటి వరకూ లేని తారు రోడ్డు... తెల్లారే సరికి కనిపించింది. అది కూడా 25 కిలోమీటర్లు. షాకైపోవడం స్థానికుల వంతైంది. ఇదెలా సాధ్యమైందో తెలుసుకుందాం.

  • Share this:
    World Record: ప్రపంచంలోనే అత్యంత వేగంగా రోడ్లు ఎక్కడ నిర్మిస్తారని ఎవరైనా అడిగితే ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే... మన నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా (NHAI)... ప్రపంచ రికార్డ్ సృష్టించింది. అది మొత్తం 25.54 కిలోమీటర్ల రోడ్డు. నాలుగు లేన్లతో ఉంటుంది. నేషనల్ హైవే 52లో భాగంగా... మహారాష్ట్రలోని విజయపూర్, సోలాపూర్ మధ్య ఈ రోడ్డు ఉంది. ఇందులో మొదటి లేన్‌ను జస్ట్ 18 గంటల్లో నిర్మించినట్లు కేంద్రరోడ్డు రవాణా, నేషనల్ హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో తెలిపారు. "ఇంత వేగంగా జరిగిన ఈ పని... లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. కార్మికులకు, NHAI ప్రాజెక్టు డైరెక్టర్‌కూ, నిర్మాణ కంపెనీ ప్రతినిధులకూ నా శుభాభినందనలు." అని గడ్కరీ ట్వీట్ చేసారు.

    నిజానికి ఇది చాలా పెద్ద రోడ్డు. ఇది బెంగళూరు-చిత్రదుర్గ-విజయపూర్-సోలాపూర్-ఔరంగాబాద్-ధూలే-ఇండోర్-గ్వాలియర్ మధ్య ఉంది. హై డెన్సిటీ ట్రాఫిక్ కారిడార్‌గా దీన్ని చెబుతున్నారు. అంటే వాహనాల రద్దీ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ వరల్డ్ రికార్డ్ సాధించేందుకు దాదాపు 500 మంది కాంట్రాక్టర్ కంపెనీ ఉద్యోగులు హార్డ్ వర్క్ చేశారు. ఈ ఫీట్ మొత్తం ఒకే చోట జరగలేదు. కొన్ని చోట్ల గ్యాప్ ఇచ్చి... మొత్తంగా 25.54 కిలోమీటర్ల రోడ్డు వేశారని మంత్రి తెలిపారు. మొదట్లో 12 గంటల్లో 20 కిలోమీటర్ల రోడ్డు వెయ్యాలని పని ప్రారంభించారు. ఆ తర్వాత మరో 6 గంటలు పనిని పొడిగించి... మరో 5.5 కిలోమీటర్ల రోడ్డు వేసేశారు.


    ఇది వరకు ఈ హైవే మహారాష్ట్ర, కర్ణాటకను కలిపేది. ఇప్పుడు దాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ బైపాస్ నాలుగు లేన్ల రోడ్డులో సోలాపూర్-విజయపూర్ మధ్య ఆరు ఫ్లైఓవర్లు ఉన్నాయి. సోలాపూర్-విజయపూర్ మధ్య మొత్తం 110 కిలోమీటర్ల రోడ్డు వెయ్యాల్సి ఉంది. అక్టోబర్ 2021 నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయని గడ్కరీ తెలిపారు.


    ఇంతకు ముందు కూడా ఇలాంటి మరో వరల్డ్ రికార్డ్ నమోదైంది. మొత్తం 2,580 మీటర్ల పొడవున్న నాలుగు లేన్ల హైవేపై పేవ్‌మెంట్ క్వాలిటీ కాంక్రీట్ (PQC)ని వేశారు. 24 గంటల్లో ఆ పని పూర్తి చేశారు. దేశంలో ఢిల్లీ, వడోదర, ముంబైని కలిపే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ సమయంలో... ఈ రికార్డ్ నమోదైంది. ఇలా ఇండియా రోడ్ల నిర్మాణంలో దూసుకుపోతోంది.

    ఇది కూడా చదవండి: Corona vaccine Made in Hyderabad: ప్రధానికి కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ ... ఆత్మనిర్భర భారత్

    సోలాపూర్-విజయపూర్ సెక్షన్‌లో సరికొత్త నేషనల్ హైవే 52ని... మహారాష్ట్ర, కర్ణాటకను కలిపేలా నిర్మిస్తున్నారు. 2017లో రూ.1,889 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు