NGO CENTRAL WHIP ON NGOS RESTRICTIONS ON FOREIGN DONATIONS AND ACCOUNTS EVK
NGO: "ఎన్జీఓ"లపై కేంద్రం కొరడా.. విదేశీ విరాళాలపై ఆంక్షలు!
ప్రతీకాత్మక చిత్రం
NGO Funds | ప్రభుత్వం నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ముఖ్యంగా విదేశీ నిధులు, విరాళాల వ్యహారాల్లో కఠినంగా వ్యవహరించింది. ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయంతో 6వేల ఎన్జీవోలు ఒకే రోజు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయాయి.
ప్రభుత్వం నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లపై ప్రభుత్వం(Non Governmental organization) కొరడా ఝులిపించింది. ముఖ్యంగా విదేశీ నిధులు, విరాళాల వ్యహారాల్లో కఠినంగా వ్యవహరించింది. ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయంతో 6వేల ఎన్జీవోలు ఒకే రోజు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయాయి. ఐఐటీ దిల్లీ, జమియా మిలియా ఇస్లామియా, ఇం డియన్ మెడికల్ అసోసియేషన్, నెహ్రూ
మెమోరియల్ మ్యూజియం అం డ్ లైబ్రరీ వంటి ప్రముఖ ఎన్జీవోల లైసెన్స్‌లపై కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. నిషేధం విధించిన వాటిలో కొన్ని ఎన్జీవోలు తిరిగి దరఖాస్తు చేసుకొన్నాయి. కానీ కొన్ని దరఖాస్తు చేసుకోలేదు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకపలు విదేశీ విరాళాలపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఎన్జీఓలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడి నుంచి విరాళౄలు వస్తున్నాయని దృష్టి పెట్టింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో 5,933 ఎన్జీవోలు శనివారం విదేశీ విరాళాల లైసెన్సు లను కోల్పో యినట్లు హోం శాఖ అధికారులు వెల్లడిం చారు. దేశం లో శనివారం నాటికి 22,762 ఎఫ్సీఆర్ఏ నమోదిత ఎన్జీవోలు ఉం డగా.. నేడు ఆ సం ఖ్య 16,829కి తగ్గినట్లు పేర్కొం ది.
ప్రభుత్వ చట్టం ప్రకారం ఎన్జీవో సంస్థలు ఇతర దేశాలకు చెం దిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి విరాళాలు తీసుకోవాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కిం ద లైసెన్సు తీసుకోవాలి. ప్రస్తుతమున్న లైసెన్సు గడువు డిసెం బరు 31తో ముగిసిం ది. లైసెన్సు పునరుద్ధరణ కోసం సదరు సం స్థలు కేంద్ర హోం శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మథర్ థెరిసా మిషనరీస్పై..
కేంద్రం ఇటీవల మదర్ థెరిసాకు చెందిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపజేసిందంటూ వచ్చిన వార్తలు వచ్చాయి. దీనిపై పలు ఎన్జీఓ (NGO) లు, ప్రతిపక్షలు విమర్శలు చేశాయి. రాజకీయంగా కేంద్రాన్ని ఇరుకున బెడుతున్నాయి. దీనిపూ కేంద్రం వివరణ ఇచ్చింది. ఆ సంస్థ బ్యాంక్ ఎకౌంట్లు స్తంభించలేదని తెలిపింది. ఎఫ్సీఆర్ఏ లైసెన్సు పునరుద్ధరణ కోసం చేసుకున్న దరఖాస్తును మాత్రం రిజెక్ట్ చేశామని తెలిపింది. సరూన సమాచారం ఇస్తే సరిపోతుందని తెలిపింది.
ఈ ఏడాది కొన్ని ఎన్జీఓలు పలు ఎన్జీవోలు ఇందు కోసం అప్లికేషన్ పెట్టుకోగా కొన్ని కారణాల వల్ల వాటిని అధికారులు తిరస్కరించారు. లైసెన్సులను కోల్పోయిన వాటిల్లో ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, లాల్ బహదూర్ శాస్త్రి మోమోరియల్ ఫౌండేషన్, ఆక్స్‌ఫామ్ ఇం డియా, భారతీయ సం స్కృ తి పరిషద్, డీఏవీ కాలేజ్ ట్రస్ట్ అం డ్ మేనేజ్మెంట్ సొసైటీ వంటి ప్రముఖ ఎన్జీవోలు కూడా ఉన్నా యి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.