సాధారణంగా వీవీఐపీ(VIP)లు బయట భోజనం తినే సమయంలో.. ఎవరైనా ఆహారంలో విషప్రయోగం చేశారేమోనని భయపడుతుంటారు. కొందరు తాము తినబోయే ఆహారాన్ని ముందస్తుగా టెస్ట్ చేయడానికి ఫుడ్ టేస్టర్ ఉద్యోగులను నియమించుకుంటారు. రాజుల కాలం నుంచి ఇలాంటి పద్ధతులనే పాటిస్తున్నారు. కానీ ఇకపై ఇలాంటి అవసరం ఉండదు. ఫుడ్(Food) పాయిజన్‌ను గుర్తించేందుకు సరికొత్త కిట్ అందుబాటులోకి రానుంది. గుజరాత్ (Gujarath) కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU) ఈ కిట్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని సాయంతో 10 నిమిషాల్లోపు ఆహారంలో విషం (Poison), ఇతర కలుషితాలను, కల్తీని గుర్తించవచ్చని ఎన్ఎఫ్ఎస్యూ(NFSU) చెబుతోంది.
విదేశీ ప్రముఖులు, కేంద్ర మంత్రులు(Central Ministers), ముఖ్యమంత్రులతో సహా వీవీఐపీలకు అందించే ఆహారం అనుకోకుండా కలుషితం కావచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా విషప్రయోగం జరగొచ్చు. అందుకే ఆహారాన్ని టెస్ట్ చేయాలనే ప్రోటోకాల్(Protocol) ఉంటుంది. అయితే ఈ టెస్టింగ్ విషయంలో మానవులకు బదులుగా కిట్లను ఉపయోగించడం సరైన నిర్ణయమని ఎన్ఎఫ్ఎస్యూ అభిప్రాయపడింది. ఈ కిట్ 2022 జనవరి నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
ఇది చదవండి: అవయవదానంలో కూడా వీడని స్నేహం.. చనిపోయి కూడా 13 మందిని బతికించారు.. ఎక్కడంటే..
ఆహారాన్ని పరీక్షించేందుకు కెమికల్ రియాక్షన్ బేస్డ్ ర్యాపిడ్ కిట్(Chemical Reaction Based Rapid Kit)లను తయారు చేయాలని కోరుతూ అనేక రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖలు తమను సంప్రదించినట్లు ఎన్ఎఫ్ఎస్యూ వైస్ ఛాన్సలర్ డా. జే.ఎం వ్యాస్ చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టు మొదటిదని తెలిపారు. కెమికల్ రియాక్షన్ ప్రిన్సిపుల్స్ ఉపయోగించి ఆహారంలో కలుషితాలు, విషాలను గుర్తించడం.. డ్రగ్స్ గుర్తించడం.. పాలు, ఎరువులలో కల్తీ పదార్థాలను గుర్తించడం వంటి కిట్లను అభివృద్ధి చేసే నిపుణుల బృందానికి సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జయరాజ్ సింగ్ సర్వయ్య(Sarvaiah) నాయకత్వం వహిస్తున్నారు.
ఇది చదవండి: తల్లి మాటలే ఆ శిశువులకు మందు.. తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే..
కిట్లు ఎలా పని చేస్తాయి?
ప్రతి రసాయన పదార్థం(Chemical substance) మరొక రసాయన పదార్థానికి ప్రతిస్పందిస్తుందని డా.సర్వయ్య వివరించారు. ఉదాహరణకు, ఏదైనా ఫుడ్ లో విషం ఉంటే సైనైడ్ టెస్ట్ వైలెట్గా మారుతుందని వెల్లడించారు. ఫుడ్ లో ఆల్కలాయిడ్ కలుషితాలు ఉంటే, అది డార్క్ బ్లూ కలర్ ను ప్రదర్శిస్తుందన్నారు. ఈ పద్ధతిలో ఫుడ్ శాంపిల్స్(Food Samples) ఉంచే సూక్ష్మ సెంట్రిఫ్యూజ్ ఉంటుందని.. శాంపిల్స్ స్థిరపడిన తర్వాత.. రియాక్షన్ చెక్ చేయడానికి రసాయనాలపై పరీక్షిస్తారని వివరించారు.
తక్కువ సమయంలోనే ఫలితాలు ఇచ్చే విధంగా కిట్లు రూపొందిస్తున్నామన్నారు. కిట్లు దాదాపు 40 విషాలు, కలుషితాలను పరీక్షించగలవని.. దర్యాప్తు సంస్థలు, ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలకు(Forensic scientists) తెలిసిన అన్ని విషాలను పరీక్షించగలవన్నారు. ఈ కిట్లు 10 నిమిషాల్లోపు పదార్థాలను గుర్తించగలవని డా. సర్వయ్య చెప్పుకొచ్చారు. ఫుడ్ రుచి చూసేవారు సాధారణంగా ప్రముఖులకు అందించే ఆహారాన్ని కనీసం 30 నిమిషాల ముందు తీసుకుంటారని కానీ కిట్లతో చాలా సమయం ఆదా అవుతుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.