Neyveli Boiler Blast: ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్... ఆరుగురు మృతి

ప్రమాదంలో గాయపడ్డ కార్మికుడు

Neyveli Boiler Blast: రాష్ట్రంలోని కడలూరు జిల్లా నైవేలి పవర్ ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు ఓ బాయిలర్ పేలిపోయింది.

  • Share this:
    Neyveli Boiler Blast News: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కడలూరు జిల్లా నైవేలి పవర్ ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు ఓ బాయిలర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా... మరో పది మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని తిరుచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రికి బాధితుల తరలించారు. ప్లాంట్‌లో చిక్కుకుపోయిన మరికొందరు కార్మికులను బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మూడు నెలల క్రితం ఇదే ప్లాంట్‌లో పేలుడు కారణంగా ఎనిమిది మంది గాయపడిన ఘటన మరువకముందే మరోసారి ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఈ ఘటనపై అధికారులు విచారణ మొదలుపెట్టారు.
    First published: