NEXT 2 WEEKS CRUCIAL FOR INDIA IN FIGHT AGAINST COVID THIRD WAVE AS EXPERTS STRESS OMICRON IS NOT COMMON COLD MKS
భారత్‌లో కరోనా మూడో వేవ్: వచ్చే 2వారాలు కీలకం.. Omicron సాధారణ జలుబు కాదు
ప్రతీకాత్మక చిత్రం
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు తోడు డెల్టా, ఇతర వేరియంట్లు తిరగబెట్టడంతో భారత్ లో కరోనా మూడో వేవ్ తప్పదనే వాదన మరింత బలపడింది. మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాబోయే రెండు వారాలు ఇండియాకు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదేనని వారు సూచిస్తున్నారు.
కొద్ది రోజులుగా నిపుణులు హెచ్చరిస్తున్న విధంగానే భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ తారాస్థాయికి చేరింది. బుధవారం నాటి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో కొత్తగా దాదాపు 60వేల కేసులు బయటపడటం, 500పైచిలుకు మరణాలు నమోదు కావడం గమనార్హం. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు తోడు డెల్టా, ఇతర వేరియంట్లు తిరగబెట్టడంతో భారత్ లో కరోనా మూడో వేవ్ తప్పదనే వాదన మరింత బలపడింది. మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాబోయే రెండు వారాలు ఇండియాకు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదేనని వారు సూచిస్తున్నారు. అదే సమయంలో ఒమిక్రాన్ సాధారణ జలుబు అనే తేలిక భావన కొంపలు ముంచే ప్రమాదముందనీ వార్నింగ్ ఇస్తున్నారు..
ప్రపంచ ఆరోగ్య సంస్థలో కీలక భూమిక పోషిస్తోన్న భారతీయ సైంటిస్టు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ భారత్ లో థర్డ్ వేవ్ అవకావాలు, ఒమిక్రాన్ వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదని, ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపించవచ్చని అన్నారు. ఒమిక్రాన్ సాధారణ జలుబే అనే తేలిక భావనను ఇకనైనా పక్కన పెట్టాలన్నారు.
కొవిడ్ కేసులు అకస్మాత్తుగా భారీ సంఖ్యలో పెరుగుతున్న క్రమంలో టెస్టుల విస్తృతిని ఇంకా పెంచి, ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సౌమ్య స్వామినాథన్ సూచించారు. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. సౌమ్య స్వామినాథన్ తోపాటే మీడియా సమావేశంలో పాల్గొన్న మరో ప్రముఖ డాక్టర్, సీనియర్ ఎపిడెమిలాజిస్ట్ గిరిధర్ బాబు సైతం కీలక సూచలను చేశారు..
దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం మధ్యలో కరోనా ఉద్ధృతి గరిష్ఠ స్థాయిలో ఉండొచ్చని గిరిధర్ అంచనా వేశారు. అయితే డెల్టా దశతో పోలిస్తే ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు దేశం సంసిద్ధంగా ఉందని అన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపడటంతో పాటు వ్యాక్సిన్లు కూడా వైరస్ ఉద్ధృతిని తగ్గించేందుకు దోహదపడతాయని చెప్పారు. మరోవైపు, ఐహెచ్ఎంఈ డైరెక్టర్ కిస్టఫర్ మరీ సైతం జనవరి నెలాఖరు, ఫిబ్రవరి తొలి వారం కల్లా భారత్ లో ఒమిక్రాన్ కీలక దశకు చేరుతుందని అంచనా వేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.