News18 Survey: స్కూళ్ల రీఓపెనింగ్, ఆన్‌క్లాస్‌లపై తల్లిదండ్రుల ఓపీనియన్ ఇదే

స్కూళ్ల రీఓపెనింగ్, ఆన్‌లైన్ పాఠాలపై తల్లిదండ్రులు ఏమంటున్నారు? వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు నెట్ వర్క్ 18 ప్రయత్నించింది. ఆన్‌లైన్ పోల్‌లో చాలా మంది పాల్గొని తమ అభిప్రాయలను వెల్లడించారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి.

స్కూళ్ల రీఓపెనింగ్, ఆన్‌లైన్ పాఠాలపై తల్లిదండ్రులు ఏమంటున్నారు? వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు నెట్ వర్క్ 18 ప్రయత్నించింది. ఆన్‌లైన్ పోల్‌లో చాలా మంది పాల్గొని తమ అభిప్రాయలను వెల్లడించారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి.

 • Share this:
  కరోనా ప్రభావంతో మన దేశంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. మార్చి రెండో వారం నుంచే స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఏడాది పరీక్షలు లేకుండానే పదో తరగతి ముగిసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా అందరినీ పాస్ చేశారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్లు ఎప్పుడు తెరచుకుంటాయో స్పష్టత లేదు. ఈ క్రమంలో చాలా ప్రైవేట్ స్కూళ్లు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాయి. భారీగా ఫీజుల భారం వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఈ క్రమంలో స్కూళ్ల రీఓపెనింగ్, ఆన్‌లైన్ పాఠాలపై తల్లిదండ్రులు ఏమంటున్నారు? వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు నెట్ వర్క్ 18 ప్రయత్నించింది. ఆన్‌లైన్ పోల్‌లో చాలా మంది పాల్గొని తమ అభిప్రాయలను వెల్లడించారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి.


  1. స్కూళ్లు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నట్టైతే పూర్తి ఫీజు వసూలు చేయాలా?
  a. అవును - 30.51 %
  b. కాదు - 63. 15%
  c. తెలియదు / చెప్పలేం - 6.34 %

  2. స్కూళ్లు ఫీజులు తగ్గించేందుకు అంగీకరిస్తే ఎంత శాతం తగ్గించాలని మీరనుకుంటున్నారు?
  a. 10-20% (27.32 % మంది)
  b. 20-40% ( 25.72 % మంది)
  c. 50% లేదా అంతకన్నా ఎక్కువ ( 33.66 % శాతం మంది)
  d. స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే వరకు ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు (13.30 శాతం మంది)

  3. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ విద్యాబోధన సమర్థవంతంగా ఉంటుందని మీరనుకుంటున్నారా?
  a. అవును (56.38 %)
  b. కాదు (33.07 %)
  c. తెలియదు / చెప్పలేం (10.55 %)

  4. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు టీచర్లు సుశిక్షితులై ఉన్నారని మీరనుకుంటున్నారా?
  a. అవును (47.35 %)
  b. కాదు (37.61 %)
  c. తెలియదు / చెప్పలేం (15.05 %)

  5. లాక్‌డౌన్ సమయంలో స్కూళ్లు ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం సరైనదేనా?
  a. అవును (25.31 %)
  b. కాదు (64.37 %)
  c. తెలియదు / చెప్పలేం (10.33 %)

  6. స్కూళ్లు ఎప్పుడు తెరిస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు?
  a. వెంటనే (2.93 %)
  b. 2-3 నెలల్లో (9.51 %)
  c. 6 నెలల్లో (4.95 %)
  d. వ్యాక్సీన్ రిలీజ్ అయిన తర్వాత (29.08 %)
  e. కొత్త కోవిడ్ 19 కేసులు లేనప్పుడు (33.58 %)

  7. వ్యాక్సిన్ కనిపెట్టకముందే లేదా కొత్త కేసులు సున్నాకు రాకముందే స్కూళ్లు తెరిస్తే మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తారా?
  a. అవును (22.00 %)
  b. కాదు (65.55 %)
  c. తెలియదు / చెప్పలేం (12.45 %)
  Published by:Shiva Kumar Addula
  First published: