హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rising India Summit: రేపటి నుంచి రైజింగ్ ఇండియా సమ్మిట్..సంయుక్తంగా నిర్వహిస్తున్న న్యూస్18 నెట్‌వర్క్, పూనావాలా ఫిన్‌కార్ప్

Rising India Summit: రేపటి నుంచి రైజింగ్ ఇండియా సమ్మిట్..సంయుక్తంగా నిర్వహిస్తున్న న్యూస్18 నెట్‌వర్క్, పూనావాలా ఫిన్‌కార్ప్

రైజింగ్ ఇండియా సమ్మిట్

రైజింగ్ ఇండియా సమ్మిట్

న్యూఢిల్లీలో నిర్వహించనున్న రైజింగ్ ఇండియా సమ్మిట్-2023కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రెండు రోజుల సదస్సు నిర్వహించడానికి న్యూస్18 నెట్‌వర్క్, పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Rising India Summit: న్యూఢిల్లీలో నిర్వహించనున్న రైజింగ్ ఇండియా సమ్మిట్-2023కి(Rising india summit 2023) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రెండు రోజుల సదస్సు నిర్వహించడానికి న్యూస్18 నెట్‌వర్క్, పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది. భారతదేశం ప్రపంచంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న నేపథ్యంలో, ఒక థాట్-లీడర్‌షిప్ కాంక్లేవ్‌గా జరుగనున్న రైజింగ్ ఇండియా సమ్మిట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఈవెంట్ మార్చి 29, 30 తేదీలలో న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరుగుతుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, ఇతర ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.

* ఇండియా సక్సెస్‌ఫుల్‌ జర్నీ సెలబ్రేషన్‌

అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, గ్లోబల్‌ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న ఇండియా జర్నీని సెలబ్రేట్‌ చేసుకోవడానికి రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023 వేదికగా నిలువనుంది. ఈ ఈవెంట్‌ ద్వారా ప్రపంచంలో భారతదేశం ఎలా మార్పు తీసుకురాగలదనే విషయాలను తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పెషల్‌ ఈవెంట్‌ గురించి న్యూస్ 18 నెట్‌వర్క్ CEO, అవినాష్ కౌల్ మాట్లాడుతూ.. ‘భారతదేశం సంపన్న దేశంగా ఎదుగుతుండటం చూసి న్యూస్‌ 18 నెట్‌వర్క్‌ గర్వంగా ఫీల్‌ అవుతోంది. మేము ప్రతి నెలా 69 కోట్లకు పైగా భారతీయులకు ఉజ్వల భవిష్యత్తుకు మార్గం చూపడంలో సహాయపడే వార్తలు, కన్వర్జేషన్లు అందించడంలో నిమగ్నమవుతున్నాం. రైజింగ్ ఇండియా భారతదేశంలో గొప్ప థాట్‌ లీడర్‌షిప్‌ ఫోరంలలో ఒకటిగా గుర్తింపు సాధించింది.’ అని చెప్పారు.

World Record: 600 టీమ్‌లు.. 7,000 ప్లేయర్లు..! క్రికెట్ చరిత్రలో ఇదో వరల్డ్ రికార్డ్.. తగ్గేదే లే!

* రియల్‌ హీరోస్‌కి సత్కారం

ఈ సమ్మిట్ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గవర్నెన్స్‌, ఆర్ట్స్‌, బిజినెస్‌, విద్యాసంస్థల సహా వివిధ రంగాలకు చెందిన గౌరవనీయమైన నాయకుల చర్చా వేదికగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా, నీతి ఆయోగ్ సీఈవో B.V.R సుబ్రహ్మణ్యం వంటి థాట్‌ లీడర్స్‌ పాల్గొనే అనేక ప్యానెల్‌ డిస్కషన్‌లు ఉంటాయి. ఈ సంవత్సరం సమ్మిట్ థీమ్‌ని 'ది హీరోస్ ఆఫ్ రైజింగ్ ఇండియా'గా నిర్ణయించారు. ఇందులో భాగంగా సోషల్, కమ్యూనిటీ నేతృత్వ కార్యక్రమాల ద్వారా అట్టడుగు స్థాయిలో మార్పు తెచ్చిన సాధారణ పౌరులను సత్కరిస్తారు. ఈ రియల్‌ లైఫ్‌ హీరోలు వినూత్న పరిష్కారాలను రూపొందించారు, జీవితాలను మార్చే సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ వెంచర్‌లను ప్రారంభించారు.

పూనావాలా ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ అభయ్ భూతాడ మాట్లాడుతూ.. ‘వ్యక్తులు తమ కలలు, ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు సాధికారత కల్పించే లక్ష్యంతో మా అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ విజన్‌కు సహకరించడానికి, బలమైన, మరింత సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి కలిసి పని చేయడానికి మేము సంతోషిస్తున్నాం.’ అని తెలిపారు.

First published:

Tags: Network18

ఉత్తమ కథలు