హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

News 18 నెట్‌వర్క్, BYJU’S యంగ్ జీనియస్ సీజన్ 2

News 18 నెట్‌వర్క్, BYJU’S యంగ్ జీనియస్ సీజన్ 2

ఒక కళాకారుడు TVలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు, అతనిలోని తపన, అలుపెరగని పట్టుదల, గంటల తరబడి పట్టువివడక చేసిన సాధన మన కంటికి కనిపించవు

ఒక కళాకారుడు TVలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు, అతనిలోని తపన, అలుపెరగని పట్టుదల, గంటల తరబడి పట్టువివడక చేసిన సాధన మన కంటికి కనిపించవు

ఒక కళాకారుడు TVలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు, అతనిలోని తపన, అలుపెరగని పట్టుదల, గంటల తరబడి పట్టువివడక చేసిన సాధన మన కంటికి కనిపించవు

  News 18 నెట్‌వర్క్, BYJU’S యంగ్ జీనియస్ సీజన్ 2తో కలిసి భారతదేశంలోని మరొక సారి అసామాన్య ప్రతిభ ఉన్న చిన్నారుల కోసం శోధన ప్రారంభించాయి


  మనమందరం మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో అందరికంటే తెలివైన వారం అవ్వాలని కోరుకునే ఉంటాం. ఏదొక విషయంలో మేధస్సు ఉండటం అనేది మనకు ఖచ్చితంగా విలువైన అంశమే. కానీ పుట్టుకతోనే ఎవరు మేధావులు కారు, కృషితో మేధావులుగా ఆవిర్భవిస్తారనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాం. ఒక కళాకారుడు TVలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు, అతనిలోని తపన, అలుపెరగని పట్టుదల, గంటల తరబడి పట్టువివడక చేసిన సాధన మన కంటికి కనిపించవు, కానీ ఇవన్నీ కలగలిసే మన ముందు ఆ మేధావిని నిలబెడతాయి.

  అద్భుతమైన చిన్నారి అంటే ఏమిటి? తెలివి, ప్రేరణ, జిజ్ఞాస, ఊహాత్మకత, సృజనతో కూడి ఎలాంటి పరిస్థితులకైనా భయపడని చిన్నారి. వారాంతంలో ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో క్లిష్టమైన పరిస్థితులలో పెరిగి, అంతర్జాతీయ స్థాయిలో కళ్ళు చెదిరే ప్రదర్శనలు ఇచ్చిన స్వదేశీ పౌరులను చూశాం. పురుషుల జావెలిన్ త్రోలో అద్భుతమైన స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా ప్రయాణం హర్యానాలోని చిన్న పల్లెటూరిలోని ఒక పాకలో ప్రారంభమయ్యింది. క్లిష్టమైన జీవనం, ఆర్థిక ఇబ్బందులు, చాలీ చాలని వసతులతో మధ్య భారతదేశానికి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన గొప్ప ఆటగాడిగా నిలిచారు. ఇలాంటి మాణిక్యాలని మట్టిలోనుండి బయటకు తీసుకువచ్చి, సానపెట్టి వారి ప్రతిభ పబ్లిక్ వేదికలపై ప్రదర్శించగలిగితే ప్రపంచానికి అద్భుత ప్రతిభను పరిచయం చేయగలుగుతాం.

  ఈ ఉద్దేశ్యంతోనే భారతదేశపు అతి పెద్ద వార్తా సంస్థ అయిన Network18, BYJU’S యంగ్ జీనియస్‌తో. ఈ కార్యక్రమ కీలక ఉద్దేశ్యం భవిష్యత్తులో మేధావులుగా ఆవిర్భవించగలిగే అద్భుతమైన చిన్నారులను వెలుగులోనికి తీసుకురావడం. సీజన్ 1లో News 18 ఎడిటర్లు, ప్రముఖులు ఉన్న ప్యానెల్ ఎంపిక చేసిన యంగ్ అచీవర్స్ వారి నైపుణ్యాలను ప్రదర్శించారు.

  వీరిలో నిమిషానికి 190 బీట్‌ల వేగంతో, కళ్ళగంతలు కట్టుకుని మరీ పియానో వాయించిన లిడియన్ నాదస్వరం (15), అద్భుతమైన IQతో ‘Google Girl of India’గా పేరు పొందిన మేఘాలి మాళబిక (14), మెన్సా సొసైటీ సభ్యులు, అనేక యాప్‌లు సిద్ధం చేసిన డెవలెపర్, పుస్తక రచయిత అయిన రిషి శివ పి (6) IQ అద్భుతమైన 180 పాయింట్ల వద్ద ఉంది. అవంతిక కాంబ్లి (10) చువ్వల కింద చేసే లింబో స్కేటింగ్‌లో అత్యంత ఎక్కువ దూరం స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ‘తిలక్ కైసమ్ (13)తో కలిసి, 6-అంకెల స్వేర్ రూట్ చేయడంలో ప్రపంచ రికార్డ్ కోసం ప్రయత్నించిన అతి పిన్న వయస్కురాలు. సామాజిక స్పృహ పెంచి, విద్యాసంస్థలలో వేధింపులకు గురయ్యే విద్యార్థల కోసం అనౌష్క జాలీ (12) సామాజిక వ్యాపారవేత్తగా మారి యాంటీ-బుల్లీయింగ్ స్క్వాడ్ (ABS) అనే వెబ్ ప్లాట్‌పారమ్ ప్రారంభించింది.

  ఇలాంటి అసామాన్య నైపుణ్యాలు ఉన్న చిన్నారులు ఎందరికో ప్రేరణగా నిలుస్తారు, 98.4% మంచి స్పందన వచ్చి, దేశ వ్యాప్తంగా ప్రజల మరిన్ని ఎపిసోడ్‌ల కోసం అభ్యర్థించారు. మొదటి సీజన్ ఘన విజయం సాధించడంతో, News18 నెట్‌వర్క్ యంగ్ జీనియస్ రెండవ సీజన్ ఎడిషన్‌తో ఇలాంటి అద్భుతమైన చిన్నారుల అసామాన్య కథలను మన ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. షో వివరాలు ఇక్కడ ఇచ్చాము:

  సీనియర్ Network18 ఎడిటర్ మరియు యాంకర్ ఆనంద నరసింహన్ హోస్ట్‌గా, ఈ కార్యక్రమం జనవరి 2022లో ప్రారంభం కానుంది. ఇందులో లలిత కళలు, విద్య, సాంకేతికత, వ్యాపారం క్రీడలు అలాగే మరెన్నో రంగాలలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న 6 నుండి 15 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు సంబంధించి 11 ఎపిసోడ్‌లు ఉండబోతున్నాయి. ప్రతీ ఎపిసోడ్ కన్నుల విందుగా ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్నారులతో పాటు భారతదేశంలో ప్రాముఖ్యం చెందిన ఒక సెలబ్రిటీ ప్రతీ ఎపిసోడ్‌లో వీరికి ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, వారి జీవన పయనాన్ని అందిరితో పంచుకోబోతున్నారు.

  ఇది మీకు ఆసక్తికరంగా అనిపిస్తే, https://www.news18.com/younggenius/ సందర్శించి రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపండి. ప్రారంభ ప్రక్రియ తర్వాత వివిధ దశలలో చిన్నారిని అంచనా వేయడానికి వివరణాత్మకమైన ఫారమ్ నింపాలి. దీనితో పాటు, మీరు BYJU’s యాప్ డౌన్‌లోడ్ చేసుకుని BYJU’s యంగ్ జీనియస్ విభాగంలో రిజిస్టర్ చేసుకోవచ్చు.

  మీ చిన్నారి ప్రతిభను ఎలా వెలికి తీయాలి అని ఆలోచిస్తుంటే, దానికి రహస్య చిట్కా వారికి నచ్చిన పనిలో వారు పూర్తి నిమగ్నతో ముందుకు వెళ్లేలా చేయడం. ఈ ప్లాట్‌ఫామ్ తెలివైన, ప్రతిభ ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి నచ్చిన రంగాలలో వారి కలలను సాకారం చేసుకోవడానికి ప్రోత్సహించడం కోసం ఉద్దేశించినది. మనలో ప్రతీ ఒక్కరిలో ఒక మేధావి ఉన్నారు, అలాంటి మేధావులను ప్రపంచానికి పరిచయం చేయడానికి News 18 నెట్‌వర్క్ ఒక సువర్ణావకాశం ఇస్తుంది.

  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: BYJUS, Network18

  ఉత్తమ కథలు