మొత్తం 90 అసెంబ్లీ సీట్లున్న హర్యానాలో బీజేపీ 75 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని సర్వేలో తేల్చగా, కాంగ్రెస్కు కేవలం 10 సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉన్నట్లు తేలింది.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాల వైపు దేశ ప్రజలు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో... తాజాగా న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీ వైపు మొగ్గు చూపింది. హర్యానాలో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని తేల్చింది. ఇప్పటికే బీజేపీ 2014లో అధికారం దక్కించుకోగా, రెండో సారి కూడా హర్యానా ప్రజలు బీజేపీకే పట్టం కట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ సీట్లున్న హర్యానాలో బీజేపీ 75 సీట్లు దక్కించుకునే అవకాశం ఉందని సర్వేలో తేల్చగా, కాంగ్రెస్కు కేవలం 10 సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉన్నట్లు తేలింది. ఇక ఇతరులకు 3 సీట్లు, ఐఎన్ఎల్డీకి ఖాతా తెరిచే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. దీంతో ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు ఆమోదం తెలిపినట్లు న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేలింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.