హోమ్ /వార్తలు /జాతీయం /

News18-IPSOS Exit Polls : న్యూస్ 18 - ఐపీఎస్‌ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు సమీపంగా ఎలా వచ్చాయంటే...?

News18-IPSOS Exit Polls : న్యూస్ 18 - ఐపీఎస్‌ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు సమీపంగా ఎలా వచ్చాయంటే...?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూస్ 18 - ఐపీఎస్‌ఓఎస్ ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇంతలా వాస్తవ ఫలితాలు ప్రతిబింబించేలా వచ్చేందుకు కచ్చితమైన ప్రణాళిక, గణాంకాల సేకరణలో నాణ్యమైన పనితీరు, అత్యుత్తమ సాంకేతిక నిపుణుల బృందం ఎంపిక దోహదపడ్డాయి. ఫలితంగా దేశంలోని అన్ని పలు సర్వే సంస్థలు చేసిన సర్వేల కన్నా న్యూస్ 18 - ఐపీఎస్‌ఓఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే వాస్తవ ఫలితాలకు అత్యంత సమీపంగానూ, కచ్చితత్వానికి మారుపేరుగా నిలిచింది.

ఇంకా చదవండి ...

  దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేపిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో న్యూస్ 18 - ఐపీఎస్‌ఓఎస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరోసారి కచ్చితత్వానికి, వాస్తవిక ఫలితానికి ప్రతీకగా నిలిచాయి. ముఖ్యంగా న్యూస్ 18 - ఐపీఎస్‌ఓఎస్ ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇంతలా వాస్తవ ఫలితాలు ప్రతిబింబించేలా వచ్చేందుకు కచ్చితమైన ప్రణాళిక, గణాంకాల సేకరణలో నాణ్యమైన పనితీరు, అత్యుత్తమ సాంకేతిక నిపుణుల బృందం ఎంపిక దోహదపడ్డాయి. ఫలితంగా దేశంలోని అన్ని పలు సర్వే సంస్థలు, మీడియా హౌజెస్ చేసిన సర్వేల కన్నా న్యూస్ 18 - ఐపీఎస్‌ఓఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే వాస్తవ ఫలితాలకు అత్యంత సమీపంగానూ, కచ్చితత్వానికి మారుపేరుగా నిలిచింది. ఐపీఎస్‌ఓఎస్ సంస్థ అంతర్జాతీయంగా పలు దేశాల్లో అత్యంత కచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన ట్రాక్ రికార్డు సొంతం చేసుకుంది. అలాగే ఐపీఎస్‌ఓఎస్ సంస్థ ముందుగా ఓటింగ్ షేర్ ను అంచనా వేయడంలో విజయం సాధించింది. ఐపీఎస్‌ఓఎస్ సంస్థ ముందుగా ఎన్‌డీఏ ఓటు షేర్ 48.5 శాతం రావచ్చని అంచనా వేసింది. అయితే ఫలితాల అనంతరం ఎన్నికల కమిషన్ సైతం ఎన్‌డీఏ ఓటు షేర్ 49 శాతంగా వెలువరించింది. ఐపీఎస్‌ఓఎస్ ఫలితాలు కచ్చితంగా వెలువడేందుకు మూడు కీలక అంశాలు దోహదపడ్డాయి. ప్రణాళిక, అమలు చేసే తీరు, గణాంక విశ్లేషణ తోడ్పాటు అందించాయి.
  ప్రణాళికా దశ :

  ఐపీఎస్‌ఓఎస్ సంస్థ తన అంతర్జాతీయ అనుభవంతో పక్కా ప్రణాళికతో గణాంకాల సేకరణ ప్రారంభించింది. వివిధ దేశాల్లో ఐపీఎస్ఓఎస్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ముందుగా సైంటిఫిక్ పద్ధతుల్లో శాంపిళ్ల సేకరణలో కచ్చితమైన నాణ్యమైన ప్రమాణాలు పాటించడం ద్వారా విజయం సాధించింది. సరిగ్గా అదే పద్ధతిలో మన దేశంలో సైతం శాంపిళ్ల సేకరణలో జాగ్రత్తలు పాటించింది. ముందుగా 199 పార్లమెంటరీ నియోజకవర్గాలను ఎంపిక చేసుకోగా, అందులో 796 అసెంబ్లీ నియోజక వర్గాలు, మళ్లీ వాటిలోని 4776 పోలింగ్ స్టేషన్లలో సింపుల్ రాండమ్ శాంపిళ్లను సేకరించింది. అయితే శాంపిల్ సేకరించిన సమయం, అలాగే ప్రదేశం విషయంలో వైవిధ్యతను పాటించింది. అలాగే సమూహాల వారీగా కాకుండా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల నుంచి సమాచారం సేకరించారు.


  ప్రణాళిక అమలు చేసిన దశ :

  పోస్ట్ పోల్, ఆన్ లైన్, టెలిఫోనిక్, మొబైల్ యాప్ ఇలా అనేక మెథడాలజీ పద్ధతుల ద్వారా ముందుగా డేటాన సేకరించారు. పోలింగ్ మొత్తం 7 దశల్లో జరగగా, పోలింగ్ స్టేషన్ల నుంచి ఎన్నికల దశ నుంచి డేటాను గత డేటాతో పోల్చుకోవడం ద్వారా కచ్చితమైన సమాచారం అందేందుకు దోహదపడింది.


  అత్యాధునిక టాబ్లెట్లను ఉపయోగించి డేటాను సేకరించారు. ఐపీఎస్‌ఓఎస్ టీమ్ వివిధ వర్గాల ప్రజలను ఎంపిక చేసుకొని డేటాను సేకరణలో వైవిధ్యతను పాటించారు. అలాగే మొత్తం 35 మంది క్యూసీ ఎగ్జిక్యూటివ్స్ డేటా విశ్లేషణ బాధ్యతలు చేపట్టారు. టాబ్లెట్లకు జీపీఎస్ ఎనెబుల్డ్ చేయడం ద్వారా సమాచారం ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అలాగే మొత్తం నాలుగు రీజినల్ కంట్రోల్ రూమ్ లతో పాటు ఒక జాతీయ కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేసి డేటా విశ్లేషణకు అత్యాధునిక పద్ధతులను వాడారు.


  ఐపీఎస్‌ఓఎస్ సంస్థ మొత్తం 5-6 వారాల వ్యవధిలో సేకరించిన మొత్తం డేటాను, వివిధ దశల్లో వడపోసి చివరకు అత్యంత కచ్చితమైన ఫలితాలను వెలువరిచింది. ఐపీఎస్‌ఓఎస్ తన సర్వేను చేసేందుకు ఎంపిక చేసుకున్న సమయం కూడా విజయానికి తోడ్పడింది. నవంబర్ 2018 నుంచి మార్చి 2019 వరకూ నిర్వహించిన ట్రస్ట్ సర్వేలో సైతం వివిధ ట్రెండ్స్ ఆధారంగా కచ్చితమైన గణాంకాలను వెలువరించింది.


  This article has been authored by Parijat Chakraborty (Country Service Lines Group Leader – Public Affairs) of IPSOS India

  First published:

  Tags: Exit polls 2019, News18

  ఉత్తమ కథలు