న్యూస్18 వెబ్సైట్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ క్రమంలో దేశంలోనే నంబర్‌వన్ న్యూస్ వెబ్సైట్ స్థాయికి చేరుకుంది. అనేక భారతీయ భాషల్లో న్యూస్ అందిస్తున్న న్యూస్18.. టైమ్స్ గ్రూప్‌ను దాటేసింది. డిజిటల్ మీడియా వ్యూస్‌ను తెలియజేసే కామ్‌స్కోర్ ఈ విషయాన్ని వెల్లడించింది. 12 భాషల్లో ఉన్న న్యూస్18 వెబ్సైట్లు జూన్ 2021లో 941 మిలియన్ వ్యూస్ సాధించాయి. టైమ్స్ గ్రూప్ సాధించిన 924 వ్యూస్‌తో పోల్చుకుంటే.. న్యూస్18 వెబ్సైట్లకు 17 మిలియన్ వ్యూస్ ఎక్కువగా వచ్చాయి. ప్రేక్షకులు ఎక్కువగా ఏ వెబ్‌సైట్‌ను వీక్షిస్తారనే దానికి పేజ్ వ్యూస్‌ను ఓ కొలమానంగా చూస్తారు.
ఇక ఇదే జాబితాలో మూడో స్థానంలో ఉన్న లైవ్ హిందూస్థాన్ సాధించిన పేజ్ వ్యూస్(486 మిలియన్లు), ఆజ్‌తక్(478 మిలియన్లు) కంటే న్యూస్18 పేజ్ వ్యూస్ రెండింతలు ఉండటం విశేషం. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తలను వీక్షకులకు అందించే విషయంలో న్యూస్18 గ్రూప్ వెబ్సైట్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఆసక్తికరమైన కథనాలు, నాణ్యమైన వార్తలు అందిస్తూ న్యూస్18 తన స్థాయిని పెంచుకుంటోంది. మిగతా వెబ్సైట్ల కంటే వార్తలను అందించే విషయంలో ముందుంటోంది.
రెగ్యూలర్ వార్తలతోపాటు ప్రత్యేకమైన కథనాలు రాజకీయాలు, క్రీడలు, వినోదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్‌ను న్యూస్18 వెబ్సైట్లు వీక్షకులకు అందిస్తున్నాయి. ప్రస్తుతం న్యూస్18 వెబ్సైట్లు ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠి, తెలుగు, బంగ్లా, మలయాళం, కన్నడ, గుజరాతీ, అస్సామిస్, పంజాబీ, ఒడియా, ఉర్దూ భాషల్లో వీక్షకులకు అందుబాటులోకి ఉంది. సంస్థ ఎదుగుదలకు ఈ స్థాయిలో సహకరిస్తున్న వీక్షకులు, ప్రేక్షకులకు న్యూస్18 కృతజ్ఞతలు తెలుపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: News18