హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

News18PublicSentimeter: స్కూళ్లు, థియేటర్ల ఫున:ప్రారంభంపై న్యూస్18 పబ్లిక్ సెంటీమీటర్

News18PublicSentimeter: స్కూళ్లు, థియేటర్ల ఫున:ప్రారంభంపై న్యూస్18 పబ్లిక్ సెంటీమీటర్

News18PublicSentimeter: స్కూళ్లు, థియేటర్ల ఫున:ప్రారంభంపై న్యూస్18 పబ్లిక్ సెంటీమీటర్

News18PublicSentimeter: స్కూళ్లు, థియేటర్ల ఫున:ప్రారంభంపై న్యూస్18 పబ్లిక్ సెంటీమీటర్

#News18PublicSentimeter: అన్‌లాక్ కొత్త వెసులుబాట్లపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్న న్యూస్18 డిజిటల్ మీడియా గ్రూప్... తాజాగా సినిమాహాళ్లు, స్కూళ్ల పునఃప్రారంభంపై సర్వే చేస్తోంది.

#News18PublicSentimeter: కేంద్ర ప్రభుత్వం... అన్‌లాక్ 5.0లో భాగంగా... సినిమా హాళ్లు, స్కూళ్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్ తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 30న రాత్రి వేళ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్ల పున:ప్రారంభంపై అక్టోబరు 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చన్న కేంద్రం... స్కూళ్లు తెరిచినప్పటికీ.. విద్యార్థులదే తుది నిర్ణయమనీ... స్కూళ్లకు వెళ్లకుండా ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకావచ్చని వివరించింది. అలాగే... స్కూళ్లలో హాజరు తప్పనిసరి కాదనీ... తల్లిదండ్రుల సమ్మతితోనూ విద్యార్థులను స్కూళ్లకు అనుమతించాలని చెప్పింది. సినిమా హాళ్లు, మల్లిప్లెక్సుల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో తిరిగి తెరచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఈ రెండు అంశాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఇదివరకు ఎన్నో అంశాలపై న్యూస్18 డిజిటల్ మీడియా గ్రూప్... పబ్లిక్ సెంటీమీటర్ పేరుతో... ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మరోసారి స్కూళ్లు, థియేటర్ల రీఓపెనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. ఇదివరకట్లాగే... ఈసారి కూడా... సర్వేలో... 3 లేదా 4 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. వీటికి సమాధానం నిమిషం లోపే ఇవ్వొచ్చు. మొత్తం 13 భాషల్లో ఈ సర్వే జరుగుతోంది. సర్వేలో పాల్గొనే వారు... తమకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు.

ఈ సర్వేను ఎంతకాలం జరిపేదీ ఇంకా తేదీ ప్రకటించలేదు. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టీ... గడవు తేదీని నిర్ణయించనున్నారు. ఇదివరకు జరిపిన సర్వేల ద్వారా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు పరిశీలించాయి. ఈసారి కూడా రాబోయే ఫలితాల్ని పరిశీలించనున్నట్లు తెలిసింది.

First published:

Tags: Coronavirus, Covid-19, News18

ఉత్తమ కథలు