దేశంలోని ప్రముఖ వెబ్సైట్లలో ఒకటైన న్యూస్18 జులై-అగస్టు 2019 కామ్స్కోర్లో అగ్రగామిగా నిలిచింది. ఇప్పటివరకు అగ్రగామిగా కొనసాగుతూ వచ్చిన డైలీ హంట్(101.9మిలియన్),ఎన్డీటీవీ(76.37మిలియన్)లను అధిగమించి 103.74మిలియన్ యునిక్ విజిటర్స్‌తో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఏప్రిల్,2016లో ప్రారంభమైన News18.com మూడేళ్లలోనే తన ర్యాంకును మెరుగుపరుచుకుని దాదాపుగా అన్ని ప్రముఖ వెబ్సైట్లను అధిగమించి డిజిటల్ రేసులో ముందు నిలిచింది. News18 వెబ్సైట్,యాప్ ప్రస్తుతం 12 భాషల్లో సేవలందిస్తోంది. అంతేకాదు, ఆ 12 భాషల్లో ఒక ప్రముఖమైన స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో నెట్వర్క్18 డిజిటల్ చీఫ్ పునీత్ సింఘ్వీ మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న డిజిటల్ కంటెంట్ వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా News18.com డిజిటల్ రంగంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండటం గర్వంగా ఉందన్నారు.
నెట్వర్క్18 సంస్థలో న్యూస్18 ఒక భాగం. డిజిటల్ రంగంలో ఇది సేవలు అందిస్తోంది. దేశంలోనే బహుళ మీడియా సాధనాలను కలిగిన సంస్థగా.. టెలివిజన్,ఇంటర్నెట్,సినిమాలు,ఈ-కామర్స్,మేగజైన్స్,మొబైల్ కంటెంట్ మరియు వీటి సంబంధిత వ్యాపారాలను నెట్వర్క్18 నిర్వహిస్తోంది. డిజిటల్ మాద్యమం ద్వారా నెట్వర్క్18 బ్రేకింగ్ న్యూస్,ఒపీనియన్స్,ఫైనాన్షియల్ డేటా తదితర సమాచారాన్ని అందిస్తోంది. నెట్వర్క్18 సంస్థలో News18.com, Moneycontrol.com, Firstpost.com సహా పలు ప్రముఖ వెబ్‌సైట్స్ ఉన్నాయి. నిరంతరం కొత్త ఆలోచనలకు బీజం వేయడం.. తద్వారా డిజిటల్ రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు నెట్వర్క్18 కృషి చేస్తోంది. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ డిజిటల్ యూజర్స్‌కు
సేవలందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.