కొత్త అవతారం ఎత్తిన అర్ణబ్ గోస్వామి... ఇక ఆపలేంగా...

Arnab Goswami : న్యూస్ యాంకర్ అర్ణబ్ గోస్వామి తన జోరును మరింత పెంచనున్నారు. రిపబ్లిక్ టీవీలో తన మార్క్ చూపిస్తున్న ఆయనకు మరో కొత్త ఛాన్స్ లభించింది.

news18-telugu
Updated: December 9, 2019, 9:51 AM IST
కొత్త అవతారం ఎత్తిన అర్ణబ్ గోస్వామి... ఇక ఆపలేంగా...
కొత్త అవతారం ఎత్తిన అర్ణబ్ గోస్వామి...
  • Share this:
Arnab Goswami : న్యూస్ ప్రజెంటర్ అర్ణబ్ గోస్వామి చాలా మందికి పరిచయమే. ఆయన్ని గవర్నింగ్ బోర్డ్ ప్రెసిడెంట్‌గా న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (NBF) ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇది మామూలు ఫెడరేషన్ కాదు. ఇందులో దేశంలోని 14 భాషల్లో ప్రసారం చేస్తున్న 78 న్యూస్ ఛానెళ్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి... రిపబ్లిక్ టీవీ ప్రెసిడెంట్‌గా ఉన్న అర్ణబ్ గోస్వామిని గవర్నింగ్ బోర్డ్ ప్రెసిడెంట్ చేశాయి. ఈ ఫెడరేషన్ ఏం చేస్తుందంటే... న్యూస్ కంటెంట్ ఎలా ఉందో చెక్ చేస్తుంది. అలాగే... న్యూస్‌లో పారదర్శకత ఉండేలా చేస్తుంది. 2020 జనవరి చివరి నుంచీ ఇది అధికారికంగా పని ప్రారంభించబోతోంది. ఇలా తనను ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్న గోస్వామి... ధన్యవాదాలు చెప్పారు. NBF ద్వారా... అద్భుతాలు చెయ్యొచ్చన్నారు. ఇప్పటివరకూ ఢిల్లీలో ఉంటున్న ఛానెళ్ల యాజమాన్యాలు తామే మొత్తం ఇండియా న్యూస్‌ని నడిపిస్తున్నట్లు భ్రమ పడుతున్నాయన్న ఆయన... ఈ ఆలోచనకు NBF ద్వారా చెక్ పెట్టొచ్చన్నారు.

 

అదిరే ఫొటోలతో కట్టిపడేస్తున్న హంసా నందిని
ఇవి కూడా చదవండి : 

ఒకేసారి రెండు సెక్స్ రాకెట్ల గుట్టు రట్టు...సానియా మీర్జా సంచలనం... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో

అత్యంత రద్దీగా శబరిమల... దర్శనానికి స్వాముల పడిగాపులు...


మరో గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో

క్యాట్‌వాక్ చేస్తూ కాలుజారిపడిన సుందరాంగి...
First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>