Rahul Gnadhi Fake Video Case : రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి చెందిన వీడియోను టీవీలో తప్పుడు రీతిలో ప్లే చేసిన కేసులో జీ టీవీ న్యూస్ యాంకర్(ZEE News Anchor) రోహిత్ రంజన్ ని పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీ శివార్లలోని రోహిత్ నివాసానికి వెళ్లిన ఘజియాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి చత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిచగా ఘజియాబాద్ పోలీసులు(Gaziabad Police) రంగంలోకి దిగి రంజన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలోని రాహుల్ ఆఫీస్ పై కొందరు యువకులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనను ఖండిస్తూ రాహుల్ గాంధీ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇలా చేసిన యువకులు చాలా బాధ్యతారహితం ప్రవర్తించారని... అయినా వారు చిన్న పిల్లలని, పిల్లల్ని క్షమించి వదిలి పెట్టాలని రాహుల్ ఆ వీడియోలో అన్నారు. అయితే ఈ వీడియోను జీ న్యూస్ తప్పుగా ప్లే చేసింది. రోహిత్ రంజన్... జీ టీవీ ఛానెల్లో పేరుగాంచిన డీఎన్ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నాడు. రాహుల్ గాంధీ వయనాడ్ లో తన ఆఫీస్ పై జరిగిన దాడి గురించి వీడియో రిలీజ్ చేయగా..దాన్ని ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ని ముస్లిం యువకులు హత్య చేసిన ఘటనకి లింక్ చేస్తూ వీడియోను టీవీలో ప్లే చేశారు. ఉదయ్‌పూర్ నిందుతులని వదిలిపెట్టాలని రాహుల్ చెప్పినట్లు ఉద్దేశం వచ్చేలా రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరించి రాహుల్ వీడియోను ప్లే చేశారు. దీంతో జీ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ పై చత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్గ్రాల్లో కేసులు నమోదయ్యాయి.
OMG : గాల్లో ప్రయాణిస్తున్న విమానానికి భారీ రంధ్రం..ఆ తర్వాత అంతా షాక్!
నిజానికి ఆ వీడియో ప్లే చేసినందుకు జీ టీవీ యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది. కానీ కేసును సీరియస్‌గా తీసుకున్న చత్తీస్గడ్ పోలీసులు ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో యాంకర్ రోహిత్‌ను అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లారు. రోహిత్‌ను చత్తీస్ఘడ్ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో యాంకర్ రోహిత్..స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేయడం పట్ల యూపీ పోలీసుల సహాయం కోరారు. చత్తీస్గడ్ బృందం అరెస్టు చేయడానికి ముందే ఘజియాబాద్ పోలీసులు జోక్యం చేసుకున్ని ముందస్తుగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arrested, Rahul Gandhi