హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Exclusive: Modi@8: రైతులను బంగారు వ్యవసాయ రంగం వైపు నడిపిస్తున్న కేంద్రం.. న్యూస్‌18తో కేంద్ర మంత్రి తోమర్‌..

Exclusive: Modi@8: రైతులను బంగారు వ్యవసాయ రంగం వైపు నడిపిస్తున్న కేంద్రం.. న్యూస్‌18తో కేంద్ర మంత్రి తోమర్‌..

ప్రధాని మోదీ, మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

ప్రధాని మోదీ, మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

దూరదృష్టితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, కేంద్ర పథకాల ఫలాలు రైతులకు అందాయని కేంద్ర వ్యవయసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

దూరదృష్టితో ప్రధానమంత్రి(Prime Minister) నరేంద్ర మోదీ(Narendra Modi) నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకున్న చర్యలతో గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో వ్యవసాయ రంగం(Agriculture Sector) ఎంతో అభివృద్ధి చెందిందని, కేంద్ర పథకాల ఫలాలు రైతులకు అందాయని కేంద్ర వ్యవయసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, కేంద్ర పథకాలను వివరిస్తూ నరేంద్ర సింగ్‌ తోమర్‌ న్యూస్‌18కు(News18) ప్రత్యేకంగా రాసిన వ్యాసంలో.. గత ఎనిమిదేళ్లలో కేంద్ర వ్యవసాయం(Agriculture), రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన సర్వతోముఖ ప్రయత్నాల ఫలితాలు సమాజంలో ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. రైతుల స్థితిగతులను మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కార్యక్రమాలు, పథకాలు(Schemes), కార్యక్రమాల రూపంలో కేంద్ర వ్యవసాయ శాఖ అనేక వినూత్న ప్రయత్నాలు చేసిందన్నారు. వ్యాసంలో ఆయన పేర్కొన్న వివరాలు..

Modi@8: రాజకీయాల్లో మోదీ గురు మంత్రాన్ని అనుసరిస్తున్నాను: న్యూస్18తో యూపీ ఎంపీ వినోద్ సోంకర్..!


ఆరు రెట్లు పెరిగిన బడ్జెట్‌ కేటాయింపులు

రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి, పూర్తి పారదర్శకతతో ఢిల్లీ నుంచి వ్యవసాయ సహాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. రైతుల ఆదాయం పెరిగింది, వ్యవసాయాన్ని వ్యాపారంగా అంగీకరించే దిశగా వారి ఆలోచన మారుతోంది. గత ఎనిమిదేళ్ల బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి. ఎనిమిదేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు దాదాపు ఆరు రెట్లు పెరిగాయి. రైతు అనుకూల వ్యవసాయ విధానాలు తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా పేర్కొనవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ బడ్జెట్‌కు దాదాపు రూ.1.32 లక్షల కోట్లు. దీని ద్వారా రైతు సంక్షేమం పై కేంద్రం చూపుతున్న శ్రద్ధ అర్థమవుతుంది.

బడ్జెట్‌ కేటాయింపులతో పాటు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు, ఉద్యానవన పంటల ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తోంది. 2021-22 సంవత్సరంలో మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, ఆహార ధాన్యాల ఉత్పత్తి సుమారు 315 మిలియన్ టన్నులుగా, ఉద్యానవన రంగం ఉత్పత్తి 334 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఉత్పత్తులు ఈ స్థాయిలో లేకపోవడం గమనార్హం. వాస్తవానికి కరోనా సవాళ్ల మధ్య, భారతదేశం చాలా దేశాలకు ఆహార ధాన్యాలను సులభంగా సరఫరా చేయడం సులువైన పని కాదు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో కూడా, అవసరమైన దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసే ప్రధాన దేశంగా భారతదేశం నిలిచింది. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరగడమే కాకుండా వ్యవసాయ ఎగుమతులు కూడా నిరంతరం పెరుగుతూ దాదాపు రూ.4 లక్షల కోట్లకు చేరాయి.

Monkeypox : ఇండియాకు మంకీపాక్స్ వైరస్ ముప్పు? -ఈ 5లక్షణాలతో జాగ్రత్తగా ఉండాలన్న ICMR


సేంద్రియ వ్యవసాయం అభివృద్ధికి చర్యలు

మెరుగైన జీవనోపాధి కోసం రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి, ప్రభుత్వం ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. 2013-14 సంవత్సరంలో వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,310 ప్రస్తుతం రూ.1,940గా ఉంది. అదేవిధంగా 2013-14లో గోధుమలకు ఎంఎస్‌పీ క్వింటాల్‌ ధర రూ.1,400గా ఉండగా ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2,015 చెల్లిస్తున్నారు. 2021-22లో రబీ మార్కెటింగ్ సీజన్‌లో కేంద్రం రికార్డు స్థాయిలో 433.44 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ప్రభుత్వం MSPకి కొనుగోలు చేసింది. ఎక్కువగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్‌లలో ఇప్పటివరకు గోధుమలు అత్యధికంగా కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో 49.19 లక్షల మంది గోధుమలు ఉత్పత్తి చేసే రైతులు రూ.85,604.40 కోట్ల రూపాయలను ఎంఎస్‌పీలో పొందారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద దాదాపు 11.50 కోట్ల మంది రైతులకు రూ.1.82 లక్షల కోట్లు కేంద్రం అందించింది. భూమి సారాన్ని పరీక్షించి ఫలితాల ఆధారంగా సాగు ప్రారంభించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సాయిల్ హెల్త్ కార్డులు కోట్లాది మంది రైతులకు చేరాయి. ఈ పథకం ద్వారా మంచి దిగుబడులు పొందేందుకు రైతులకు విస్తృత అవగాహన కల్పించింది.

ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయానికి ప్రత్యేక కేటాయింపులు చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో గంగా నది ఒడ్డున ఉన్న 5 కి.మీ ప్రాంతాన్ని సేంద్రియ వ్యవసాయం కిందకు తీసుకురానున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ కోర్సులలో సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన మెటీరియల్‌లను చేర్చేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ICAR) నుంచి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రైతుల సౌకర్యాలను మెరుగుపరచడం తో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద రూ.లక్ష కోట్లు కేటాయించడం రైతుల సంక్షేమానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. గోడౌన్లు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు, సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు, కోల్ట్‌ స్టోరేజ్‌లు వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తోంది.

రూ.1.15 లక్షల కోట్ల ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు..

ఆత్మనిర్భర్ భారత్ కింద తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్), ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల ద్వారా రైతులకు గరిష్ట ప్రయోజనాలను అందిస్తోంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు భద్రత కల్పిస్తుంది. ఎక్కువ మంది రైతులతో కనెక్ట్ కావడానికి, 'మేరీ పాలసీ, మేరే హాత్' కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు సుమారు రూ.21,000 కోట్ల ప్రీమియం జమ చేశారని, పంట నష్టాలపై రూ.1.15 లక్షల కోట్ల క్లెయిమ్‌లు పొందారని గణాంకాలు చెబుతున్నాయి.

కిసాన్ రైలు పథకం వ్యవసాయ ఉత్పత్తుల సాఫీగా రవాణా చేయడంలో కీలకం. వ్యవసాయ ఉత్పత్తులు పాడవకుండా ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 175 రూట్లలో దాదాపు 2,500 ట్రిప్పులు పూర్తయ్యాయి. ఈ ఏడాది వ్యవసాయ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో అగ్రికల్చర్ స్టార్టప్‌లు, అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది.

CM KCR : దేశయాత్రకు బ్రేక్!.. ఫామ్‌హౌస్‌కు కేసీఆర్.. దసరా నుంచి ఢిల్లీలో చక్రం.. PM అవుతారంటూ..


కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 వరకు 'కిసాన్ భాగీ దారి, ప్రాథమిక హమారీ' ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ప్రచారం సందర్భంగా, మంత్రిత్వ శాఖలోని అన్ని విభాగాలు, ఐసీఏఆర్‌తో సహా దాని పరిధిలోని అన్ని సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న 700 కృషి విజ్ఞాన కేంద్రాలలో రైతుల ఉత్సవాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లను నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

భారతదేశం 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే సమయానికి బంగారం లాంటి వ్యవసాయ రంగాన్ని మళ్లీ చూస్తామని, ఆ దిశగా అందరం కృషి చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు.

First published:

Tags: Agriculuture, Central Government, Pm modi, PM Narendra Modi

ఉత్తమ కథలు