Home /News /national /

NEWLYWED DALIT COUPLE NOT ALLOWED TO PRAY AT TEMPLE PRIEST ARRESTED PVN

Dalit Couple : ఇంకెన్నాళ్లు దళితులపై ఈ వివక్ష.. కొత్తగా పెళ్లైన దళిత జంటను గుడిలోకి రానివ్వని పూజారి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dalit Couple Not Allowed Into Temple : ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని సంస్కరణలు ప్రవేశపెడుతున్న దేశంలో దళితులపై వివక్ష తొలగిపోవడం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో గుడిలోకి దళితులకు ప్రవేశం లేదు. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో అయితే దళిత మహిళలు లేదా పురుషులు బజార్తలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అన్న నిబంధనలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
Dalit Couple Not Allowed Into Temple : ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని సంస్కరణలు ప్రవేశపెడుతున్న దేశంలో దళితులపై వివక్ష తొలగిపోవడం లేదు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో గుడిలోకి దళితులకు ప్రవేశం లేదు. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో అయితే దళిత మహిళలు లేదా పురుషులు బజార్తలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అన్న నిబంధనలు ఉన్నాయి. అధిక కులాల వాళ్లు ఉన్న ప్రాంతాల్లో దళితులు చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్లాలన్న నిబంధనలు ఇప్పటికీ అనేక గ్రామాల్లో కొనసాగుతున్నాయి. అంతేకాకుండా,అధిక కులాల వాళ్ల ఇళ్లకి వెళితే దళితులు మిగతా అందరిలాగా కుర్చీల్లో లేదా మంచం మీద కూర్చొనే అవకాశం ఉండదు. నేలపై కూర్చోవాల్సిందే. దళితుల పట్ల ఇలాంటి వివక్ష నేటి కంప్యూటర్ యుగంలో కూడా ఉండటం మరింత బాధాకరం.

అయితే తాజాగా పెళ్లి చేసుకొని గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ దళిత జంటకు చేదు అనుభవం ఎదురైంది. వివాహం తర్వాత ఆలయంలో కొబ్బరికాయ సమర్పించాలని అనుకున్న ఆ నవదంపతులను ఆలయంలోనికి వెళ్లనివ్వకుండా పూజారి అడ్డుకున్నారు. దళితులకు ఆలయంలోకి ప్రవేశం లేదంటూ ఆ దళిత జంటను పూజారులు అడ్డుకున్న ఘటన రాజస్తాన్ రాష్ట్రంలోని జలోర్ జిల్లాలోని అహోర్ సబ్‌డివిజన్ పరిధిలోని నీలకంఠ గ్రామంలో చోటచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. దేవాలయంలో ప్రార్థనలు చేసేందుకు కొత్తగా పెళ్లి అయిన దళిత జంట వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదంటూ ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూజారి..ఆ దంపతులను ఆడ్డుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. తమను గుడిలోకి అనుమతివ్వకపోవడంపై భాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పూజారిపై షెడ్యూల్డ్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు పెట్టారు.

ALSO READ Shocking : వీడు మనిషి కాదు..భార్య,మరదలిని చంపి..రోజూ వచ్చి మృతదేహాలను..

ఫిర్యాదులో..." కుకా రామ్ బారాత్ శనివారం నీలకంఠ గ్రామానికి చేరుకుంది. ఆలయంలో కొబ్బరికాయ సమర్పించాలని దంపతులు కోరుకున్నారు. మేం అక్కడికి చేరుకోగానే పూజారి మమ్మల్ని గేటు దగ్గర ఆపి కొబ్బరికాయను బయట పెట్టమని అడిగాడు.. మేము దళితులం కాబట్టి గుడిలోకి వెళ్లవద్దని పూజారి అన్నాడు" అని వధువు తారా రాం పేర్కొన్నారు. పూజారి వేలా భారతి పై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని జలోర్ పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ అగర్వాలా ఆదివారం తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Police arrest, Rajastan, Temple

తదుపరి వార్తలు