హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UP News : కోటి రూపాయల రోడ్డు.. కొబ్బరి కాయ కొడితేనే.. పగిలిపోయింది.. షాక్ తిన్న ఎమ్మెల్యే ధర్నా

UP News : కోటి రూపాయల రోడ్డు.. కొబ్బరి కాయ కొడితేనే.. పగిలిపోయింది.. షాక్ తిన్న ఎమ్మెల్యే ధర్నా

కొబ్బరి కాయ కొడుకుతున్న ఎమ్మెల్యే

కొబ్బరి కాయ కొడుకుతున్న ఎమ్మెల్యే

UP News : యూపీలో ఓ ఎమ్మెల్యేకు వింత పరిస్థితి ఏర్పడింది. ఓ రోడ్డును ప్రారంభించిడానికి వచ్చిన మహిళా ఎమ్మెల్యే కొబ్బరి కొట్టింది.కాని కొబ్బరి కాయకు బదులు రోడ్డే పగిలింది.

  ప్రభుత్వం నిర్వహించే అభివృద్ది పనులను ఆయా కాంట్రాక్టర్లకు అప్పగించి పనులు చేయిస్తుంటారు. అయితే కొన్ని చోట్ల ఇది చాలా సంక్రమంగా కొనసాగుతున్నా.. గ్రామీణ స్థాయితో పాటు అమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులు,ప్రజా ప్రతినిధులు ఉన్న చోట ఆ కాంట్రక్టర్ చేసిన అభివృద్ది గురించి చెప్పనవసం లేదు. రోడ్డు వేస్తే మరునాడే కొట్టుకుపోవడం.. బిల్డింగ్ వర్క్ అయితే కొద్ది నెలలకే పెచ్చులూడి పోవడం లాంటీ సంఘటనలు అనేకం వెలుగు చూస్తాయి. ఇలా నాసిరకం పనులపై చెప్పుకుంటూ పోతే.. దేశంలో కొకొల్లలు ఉంటాయి.

  అయితే ఉత్తర ప్రదేశ్‌లో ఇంతకంటే ఘోరమైన అవినీతి బయటపడింది. రోడ్డువేసి ప్రారంభించిన నాడే.. ఆరోడ్డు ఎంత నాసిరకమో తేలిపోయింది. ( Newly constructed Road cracked ) అది కూడా ప్రజా ప్రతినిధులు ప్రారంభోత్సం చేస్తున్న సంధర్భంలో బయటపడింది. మరి ముఖ్యంగా ఓ కొబ్బరి కాయకు రోడ్డు పగలడంతో విషయం కాస్తా వైరల్ గా మారింది.

  Konijeti Rosaiah : .ఫ్యాక్షన్లు లేవ్… కక్షల్లేవ్… దిగజారుడు పాలిటిక్స్ అసలే లేవ్…


  ఇలా ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూరు జిల్లాలోని ఖేద గ్రామం వద్ద ఓ రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ రోడ్డు కోసం రూ.1.16 కోట్లు ఖర్చు చేశారు... దీని పొడవు దాదాపు 7 కిలోమీటర్లు. అయితే దీని ప్రారంభోత్సవం కోసం స్థానిక ఎమ్మెల్యే అయిన సుచి చౌదరి వెళ్లింది. ప్రారంభోత్సవంలో భాగంగా కొబ్బరి కాయ కొట్టింది. అంతే ఆ ఎమ్మెల్యే ‌తో పాటు అక్కడ ఉన్న వారందరు షాక్‌కు గురయ్యారు. ( Newly constructed Road cracked ) ఎందుకంటే కొబ్బరికాయకు బదులు కొత్త రోడ్డు కోసం వేసిన కంకర రాళ్లు లేశాయి. ( Newly constructed Road cracked ) రోడ్డు కోసం పోసిన రాళ్లు బయటకు రాగానే అక్కడే ఉన్న ఎమ్మెల్యే భర్త నేరుగా ఓ పార తీసుకుని దాన్ని లెవల్ చేశాడు. దీంతో ఆమెకు కొపం వచ్చింది. తన ముందే ఇలా జరగడంపై అక్కడున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు అధికారుల అవినీతిపై అక్కడిక్కడే కూర్చుని ధర్నా కూడా చేశారు. ఇంత నాసిరకంగా రోడ్డును నిర్మిస్తారా? అంటూ నిలదీశారు. దీంతో దిగివచ్చిన అధికారులు ఆ రోడ్డు నిర్మాణాన్ని పరీక్షించేందుకు క్వాలిటి కంట్రోల్ విభాగానికి పంపారు.


  Sangareddy :విషాదం.. భర్త.. ఆత్మహత్య.. అది తెలిసిన వెంటనే.. భార్య, పిల్లలతో కలిసి చెరువులో దూకింది...!


  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:yveerash yveerash
  First published:

  Tags: India news, Up news