హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

New Wage Code: అక్టోబర్​ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..

New Wage Code: అక్టోబర్​ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..

New Wage Code: కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నూతన వేతన కోడ్​ను రూపొందించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.​ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది అక్టోబర్​ నుంచే ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం, ఉద్యోగుల పని వేళలు 9 గంటల నుంచి 12 గంటల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే వారానికి 3 రోజుల సెలవు ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  కార్మిక చట్టాల్లో  (new wage code 2021) మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నూతన వేతన కోడ్​ను రూపొందించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.​ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది అక్టోబర్​ నుంచే ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం, ఉద్యోగుల పని వేళలు 9 గంటల నుంచి 12 గంటల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే వారానికి 3 రోజుల సెలవు ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఒక ఉద్యోగి లేదా కార్మికుడు వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. గత నిబంధనల ప్రకారం, ఉద్యోగి 9 గంటలు పనిచేస్తే.. వారికి వారంలో ఒక రోజు సెలవు ఇవ్వాల్సి ఉండేది. తాజా నిబంధనల ప్రకారం రోజుకు 12 గంటలు పని చేస్తే, వారంలో 3 రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త వేతన కోడ్​ ముసాయిదాలో పేర్కొంది. ప్రస్తుతం సంవత్సరానికి 300 రోజుల పని దినాలు ఉండగా.. వేతన కోడ్​ అమల్లోకి వస్తే ఇది 240 రోజులకు చేరనుంది. మరోవైపు, నూతన చట్టాల ప్రకారం పనివేళలతో పాటు టేక్​ హోమ్​ శాలరీలో మార్పులు రానున్నాయి.

  ప్రస్తుతం ఉద్యోగుల చేతికి అందే జీతం తగ్గి.. పీఎఫ్​ పెరుగుతుంది. ప్రస్తుతానికి నెలవారీ జీతం తగ్గినప్పటికీ.. గ్రాట్యుటీ, పీఎఫ్​ కాంట్రిబూషన్ పెరగడంతో ఉద్యోగ విరమణ తర్వాత అందుకునే డబ్బు కూడా పెరగనుంది. రిటైర్​మెంట్​ తర్వాత వచ్చే ఈ నిధి మీకు అండగా ఉంటుంది. అయితే, పీఎఫ్​, గ్రాట్యుటీ పెరుగుదలతో కంపెనీల ఖర్చు కూడా పెరుగుతుంది. ఎందుకంటే, వారు ఉద్యోగుల కోసం పీఎఫ్​కు ఎక్కువ సహకారం అందించాల్సి ఉంటుంది. ఈ విషయాలు కంపెనీల బ్యాలెన్స్​ షీట్​ మీద ప్రభావం చూపిస్తాయి.

  తగ్గనున్న టేక్​ హోమ్​ శాలరీ..

  నూతన వేతన చట్టాన్ని ఏప్రిల్​ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా లేకపోవడంతో అవి వాయిదా పడ్డాయి. అయితే ఈ నిబంధనలను వీలైనంత త్వరగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నాలుగు ముఖ్యమైన వేతన కోడ్​లను కార్మిక మంత్రిత్వ శాఖ రూపొందించింది. చాలా రాష్ట్రాలు వీటిని అమలు చేయడానికి సిద్దమవుతుండగా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం తమ సొంత వేతన కోడ్​లు అమలు చేస్తున్నందున కొత్త వేతన కోడ్​ను అమలు చేసే పరిస్థితులు లేవని చెబుతున్నాయి.

  First published:

  ఉత్తమ కథలు