• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • NEW VVIP PLANE FOR PM MODI PRESIDENT LANDS AT DELHI AIRPORT GETS ADVANCED SAFETY FEATURES SK

Air India One: ప్రధాని మోదీ కోసం వీవీఐపీ విమానం వచ్చేసింది.. ఇవీ ప్రత్యేకతలు

ఎయిర్ ఇండియా వన్

అత్యాధునిక సదుపాయలు, రక్షణ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం రెండు విమానాల్ని డల్లాస్‌లోని బోయింగ్‌ సంస్థకి కేంద్ర ప్రభుత్వం పంపించింది. వీటిలో ఒకటి ఇప్పటికే భారత్‌కు చేరుకోగా.. మరో విమానం రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది

  • Share this:
    వీవీఐపీల ప్రయాణం కోసం ప్రత్యేక తయారుచేసిన Air India One విమానం భారత్‌కు చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్‌–777 విమానంలోనే ఇకపై ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ ప్రయాణాలు చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాత్రమే ఈ విమానాన్ని వినియోగిస్తారు. వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా ప్రత్యేకమైన ఫీచర్లతో డిజైన్ దీనిని చేశారు. క్షిపణి దాడుల్ని సైతం తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేశారు. విమానంపై హిందీలో భారత్, ఇంగ్లీష్‌లో ఇండియా అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. అత్యాధునిక సదుపాయలు, రక్షణ వ్యవస్థ ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం రెండు విమానాల్ని డల్లాస్‌లోని బోయింగ్‌ సంస్థకి కేంద్ర ప్రభుత్వం పంపించింది. వీటిలో ఒకటి ఇప్పటికే భారత్‌కు చేరుకోగా.. మరో విమానం రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది

    ఎయిర్ ఇండియా వన్ ప్రత్యేకతలు ఇవే:
    ఇది అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు. విమానంలో క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రేర్డ్‌ కౌంటర్‌మెజర్స్‌, సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ సూట్స్‌ (SPS) ఏర్పాటు చేశారు.

    అమెరికా అధ్యక్ష విమానం తర్వాత ఎయిర్‌ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్‌ ఫ్రీక్వెన్సీని జామ్‌ చెయ్యగలదు. తద్వారా క్షిపణుల్ని దారి మళ్లించగలదు.

    అమెరికా నుంచి భారత్‌‌కు మధ్యలో ఎక్కడా ఆడకుండా ఎయిర్ ఇండియా వన్‌లో ప్రయాణించవచ్చు. ఈ విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. గాలిలో ఇంధనాన్ని నింపే సామర్ధ్యం ఉంటుంది.

    ఎయిర్ ఇండియా వన్ విమానంలో ప్రధాని మంత్రి కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి.ఇది ఫూర్తి స్థాయి ఫ్లయింగ్‌ కమాండ్‌ సెంటర్‌‌గా పనిచేస్తుంది.

    ఎయిర్ ఇండియా వన్ విమానాలను ప్రత్యేక శిక్షణ పొందిన భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు. వీటి కోసం రూ.8,400 కోట్లు ఖర్చు అయింది.

    మార్గ మధ్యలో కూడా ఆడియో, వీడియో క‌మ్యూనికేష‌న్‌ పనిచేస్తుంది. విమానాల నిర్వహణ బాధ్యతలను ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) చూస్తుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: