కొత్త మోటారు చట్టం అమానుషం...బెంగాల్లో అమలు చేయడం లేదు..దీదీ ఫైర్...

కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తుందని తెలిపేందుకు ఇది నిదర్శనమని అన్నారు. అలాగే ఫెడరల్ స్ఫూర్తికి ఈ నిర్ణయం కూడా ఒక సూచిక అని అభిప్రాయపడ్డారు. అన్ని సమస్యలకూ ఆర్థిక వనరులే పరిష్కారం కాదని, మానవత్వంతో వ్యవహరించాలని మమత హితవు పలికారు.

news18-telugu
Updated: September 11, 2019, 10:58 PM IST
కొత్త మోటారు చట్టం అమానుషం...బెంగాల్లో అమలు చేయడం లేదు..దీదీ ఫైర్...
ప్రధాని మోదీ, మమత బెనర్జీ(ఫైల్ ఫోటో)
  • Share this:
కొత్తగా అమల్లోకి వచ్చిన మోటారు వాహన చట్టాన్ని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. కొత్త మోటారు వాహనాల చట్టం 2019లో సవరణలు సామాన్యులను ఇబ్బందులు కలగజేసే విధంగా ఉన్నాయని మమత బెనర్జీ విమర్శించారు. అంతేకాదు కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తుందని తెలిపేందుకు ఇది నిదర్శనమని అన్నారు. అలాగే ఫెడరల్ స్ఫూర్తికి ఈ నిర్ణయం కూడా ఒక సూచిక అని అభిప్రాయపడ్డారు. అన్ని సమస్యలకూ ఆర్థిక వనరులే పరిష్కారం కాదని, మానవత్వంతో వ్యవహరించాలని మమత హితవు పలికారు. అంతేకాదు రోడ్డురవాణా సేఫ్టీ గురించి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేపడుతోందని మమత పేర్కొన్నారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు