హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Corona Test : నీటి పుక్కిలింతతో కరోనా నిర్ధారణ పరీక్ష..ఐసీఎంఆర్ అనుమతి

Corona Test : నీటి పుక్కిలింతతో కరోనా నిర్ధారణ పరీక్ష..ఐసీఎంఆర్ అనుమతి

Corona Test : కరోనా టెస్టుకు మరో కొత్త తరహా పద్దతి అందుబాటులోకి వచ్చింది.ఇందుకోసం అందరికి అందుబాటులో ఉంవిధంగా ఈ కొత్త తరహా పద్దతిని రూపోందించారు. నోటి ద్వార ఉప్పునీటిని పుక్కిలించడం ద్వార కరోనా టెస్టును కనుక్కోవచ్చు. సీఎస్‌ఐఆర్‌కు చెందిన అనుబంధ సంస్థ ఈ పద్దతికి అనుమతులు తీసుకుంది..కాగా ఈ టెస్టును పూణే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  కరోనా ఉందా లేదా అనే సందిగ్థతతోనే అనేక మంది ప్రజలు సతమతమవుతున్నారు..ఇందుకోసం రోజు వేలాది మంది టెస్టుల కోసం బారులు తీరుతున్నారు.. కరోనా టెస్టుకు అధిక సంఖ్యలో సంబంధిత పరికరాలు లభ్యం కాకపోవడంతో పాటు అధిక ధరలు కూడ ఇందుకు కారణం అవుతున్నాయి. దీంతో టెస్టుల కోసం రోజుల తరబడి  వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది..ఇక మరి కొద్ది మంది మాత్రం స్కానింగ్ ద్వార కరోనా టెస్టును చేయించుకుంటున్నారు. కాని ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అధిక ధరలు ఉండడడంతో పాటు సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటాయనే సూచనల మేరకు అతి కొద్దిమాత్రమే స్కానింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు..ఈ నేపథ్యంలోనే అత్యంత సులువైన మరో పద్దతిని తీసుకువచ్చారు పూణే శాస్త్రవేత్తలు

  కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుండి దాని నిర్థారణకు అనేక రకాలుగా టెస్టులు వచ్చాయి..ముఖ్యంగా కరోనా నిర్థారణకు ఆర్టీపీసీఆర్, లేదా స్కానింగ్ పద్దతుల ద్వార నిర్థారణ చేస్తున్నారు. అయితే పరీక్షలతో ఫలితాలు ఉన్నా అందరికి అందుబాటులో లేని పరిస్థతి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులకు ఆర్టీ పీసీఆర్ టెస్టుల మీదనే ఆధారపడుతున్నారు. మరోవైపు ఈ కిట్ల కొరత కూడ వేధిస్తోంది. ఇక స్కానింగ్ ద్వార కేవలం పట్టణాల్లోనే వ్యాధి నిర్థారణ జరుగుతోంది.

  ఈ నేపథ్యంలోనే కరోనాను నిర్థారించేందుకు మరో రకమైన విధానానికి నాగ్‌పూర్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్‌కు అనుబంధంగా ఉన్న నీరి అనే  సంస్థ దీన్ని అభివృద్ది చేసింది. నోటితో ఉప్పునీటిని పుక్కిలించడం ద్వార కరోనా టెస్టును నిర్ధారణ చేస్తున్నారు. అయితే ఇది చాలా సరళతరంగా ఉండడం త్వరితగతిన ఫలితాలు రావడంతోపాటు పెద్దగా పరీక్షకు సంబంధించిన పరికరాలు కూడ అవసరం లేకుండానే వ్యాధిని నిర్ధారణను మూడు గంటల్లో చేయవచ్చంటున్నారు నిపుణులు. ఈ పరీక్షల కోసం ఐసీఎంఆర్ కూడ అనుమతులు ఇచ్చింది. దీంతో పూణేలో ఈ రకమైన టెస్టులు చేస్తున్నట్టు నీరీ శాస్త్రవేత్తలు తెలిపారు.

  First published:

  Tags: Corona test, Pune

  ఉత్తమ కథలు