హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Twitter Blue Tick: కేంద్ర ఐటీ శాఖ మంత్రికి బ్లూ టిక్ తీసేసిన ట్విట్టర్..

Twitter Blue Tick: కేంద్ర ఐటీ శాఖ మంత్రికి బ్లూ టిక్ తీసేసిన ట్విట్టర్..

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

కొత్త ఐటీ నిబంధనలపై భారత ప్రభుత్వం, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య గత రెండు నెలలుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

  కొత్త ఐటీ నిబంధనలపై భారత ప్రభుత్వం, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య గత రెండు నెలలుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విట్టర్ నుంచి వెలువడుతున్న నిర్ణయాలు.. చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా కొత్తగా ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ ఖాతాకు ట్విట్టర్ బ్లూ టిక్ మార్క్‌ను తొలగించింది. అయితే బ్లూ టిక్ మార్క్ తొలగింపుపై ట్విట్టర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే.. రాజీవ్ చంద్రశేఖర్.. తన ట్విట్టర్ ఖాతా పేరును రాజీవ్ ఎంపీ నుంచి రాజీవ్ జీవోఐగా మార్చడం వల్ల ఇలా జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

  ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన రాజీవ్ చంద్రశేఖర్.. కేంద్ర మంత్రిత్వ శాఖ ఏకపక్ష ప్రాతిపదికన పనిచేయదని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేదని తెలిపారు. తాను ఇప్పుడే మంత్రిత్వ శాఖ బాధ్యతుల చేపట్టినట్టు చెప్పుకొచ్చారు.

  అంతకుముందు, కొత్త ఐటీ నిబంధనలు పాటించేందుకు అన్ని ప్రధాన సోషల్ మీడియా మధ్యవర్తులకు మూడు నెలల మంజూరు చేసినప్పటికీ.. ట్విట్టర్ ఆ రూల్స్ పాటించడంలో విఫలమైందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. కొత్త ఐటీ రూల్స్‌ను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గత వారం ట్విట్టర్‌కు ఢిల్లీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. చట్టం ప్రకారం వెంటనే గ్రీవియెన్స్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కొత్త ఐటీ రూల్స్‌ను అనుసరించేందుకు తమకు 8 వారాల గడువు ఇవ్వాలని ట్విట్టర్ విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన వినయ్‌ ప్రకాశ్‌ను రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి (ఆర్‌జీవో)గా నియమించింది.

  ఇక, గతంలో కూడా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ మోహన్‌ భగవత్‌తో పాటుగా పలువురు ప్రముఖుల ట్విట్టర్‌ అకౌంట్‌ల బ్లూ టిక్ మార్క్‌ను తొలగించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ట్విటర్ వీరి ఖాతాలకు బ్లూ టిక్‌ను పునరుద్దరించింది. కాగా, వెరిఫైడ్ ఖాతాలకు ట్విటర్ ఈ బ్లూ టిక్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే.

  Published by:Sumanth Kanukula
  First published:

  ఉత్తమ కథలు