New Helmt Rule : వాహనదారుల్లో కొత్త రూల్ గుబులు పుట్టిస్తోంది. గీత దాటితే వేటు తప్పేలా కనిపించడం లేదు. మిగతా నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం పిల్లల విషయంలోనూ అంతే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇకపై, మన దేశంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు కూడా హెల్మెట్లు ధరించాల్సిందే. వారికి కూడా హెల్మ్‌ట్లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నాలుగేళ్ల పిల్లల వరకూ ఈ నిబంధనను వర్తిస్తుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్-1989కి సవరణ ద్వారా ఈ కొత్త రూల్‌ను కేంద్రం తీసుకువచ్చింది. ల సైజుకు తగ్గట్టుగా హెల్మెట్లు తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను కేంద్రం ఆదేశించింది. పిల్లల భద్రత దృష్ట్యా హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేసినట్టు కేంద్రం చెబుతోంది.
ఫిబ్రవరి 15 నాటి నోటిఫికేషన్ లో, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ... సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 138ని సవరించింది. తొమ్మిది నెలల నుండి నాలుగు సంవత్సరాల మధ్య పిల్లలకు, బైక్ పై ప్రయాణించడం లేదా తీసుకెళ్లడం వంటి భద్రతా చర్యలను ఇది సూచిస్తోంది. ఈ కొత్త నిబంధనను అతిక్రమించినవారికి రూ.1,000 జరిమానా విధించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. కాగా,ద్విచక్ర వాహనాలపై వెళ్లే పిల్లల భద్రత, హెల్మెట్ ధారణకు సంబంధించి ప్రజాభిప్రాయం కోరుతూ కేంద్రం గతేడాది అక్టోబర్ లో ఒక డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ద్వారా సవరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ (రెండవ సవరణ) రూల్స్, 2022 ప్రచురించిన తేదీ నుండి ఒక సంవత్సరం తర్వాత ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Children, Traffic rules, Two wheeler