Home /News /national /

NEW FACE MAY BE REPLACED IN KARNATAKA AS BJP HIGH COMMAND IS NOT HAPPY WITH CHIEF MINISTER BASAVARAJ BOMMAI AK

ఆ రాష్ట్రంలో మళ్లీ సీఎం మారనున్నారా ?.. యువనేతకు అవకాశం ఇవ్వబోతున్నారా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: సీఎం బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా అయిన హంగల్ జిల్లాలో కూడా పార్టీ ఓటమి చవిచూసింది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత 2023లో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పార్టీలో చర్చ మొదలైంది.


    కర్ణాటకలో మళ్లీ నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పనితీరుతో బిజెపి అగ్ర నాయకత్వం సంతృప్తి చెందలేదని.. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మెరుగైన, మరింత శక్తివంతమైన నేతను ఎంచుకోవాలని భావిస్తున్నారని సమాచారం. త్వరలోనే అలాంటి నేత తెరపైకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరుపై బీజేపీ అగ్రనాయకత్వం అసంతృప్తిగా ఉందని సమాచారం. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతో పార్టీ సంస్థ బిజీబిజీగా ఉంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత కర్ణాటకలో ముఖ్యమంత్రి విషయంలో పార్టీ పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలు, పురపాలక ఎన్నికల్లో ఓటమిపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

    సీఎం బసవరాజ్ బొమ్మై సొంత జిల్లా అయిన హంగల్ జిల్లాలో కూడా పార్టీ ఓటమి చవిచూసింది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత 2023లో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పార్టీలో చర్చ మొదలైంది. దీంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి వ్యతిరేకంగా చెబుతున్నారు. ఈ ఆందోళనలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి అగ్ర నాయకత్వం యువ ముఖానికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించవచ్చనే ప్రచారం సాగుతోంది.

    Karnataka new cm basavaraj bommai outh 11 am, karnataka news, basavaraj bommai as karnataka new chief minister, <a href='https://telugu.news18.com/tag/karnataka/'><h5 class=కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక న్యూస్, కర్ణాటక రాజకీయాలు, 11 గంటలకు సీఎం గా ప్రమాణ స్వీకారం" width="1200" height="800" class="size-full wp-image-971422" /> కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (ఫైల్ ఫోటో)


    రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావం చూపుతున్న లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కొత్త ముఖ్యమంత్రి కావొచ్చని టాక్. అయితే దళిత సామాజికవర్గానికి చెందిన నేతను కూడా ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం లేకపోలేదనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీ కర్ణాటక మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించవచ్చని.. సీనియర్ మంత్రులు కెఎస్ ఈశ్వరప్ప, మురుగేష్ నిరాని, సిసి పాటిల్, ప్రభు చౌహాన్‌లు తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రిని మారిస్తే.. కేబినెట్ పునర్ వ్యవస్థీరణ కూడా చేపట్టవచ్చని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    Padma Awards 2022: పద్మ అవార్డుల ప్రకటన.. బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్, గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్.. పూర్తి వివరాలు

    President Ramnath Kovind Speech: ఆ ఘనత దేశ ప్రజలదే.. వారిని సేవలు గొప్పవన్న రాష్ట్రపతి

    గతేడాది 2021 జులై 28న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు స్వీకరించారు. యడియూరప్ప పాలనపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నాయకత్వం.. ఆయనను పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మైను సీఎంగా ఎంపిక చేసింది. అయితే గడిచిన ఆరు నెలల్లో ఆయన మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయారని బీజేపీ హైకమాండ్ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Karnataka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు