Donald Trump India Visit: ఢిల్లీలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్...ఇవాల్టి షెడ్యూల్ ఇదే...

Donald Trump India Visit: ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు చేసే స్వాగత కార్యక్రమంలో ట్రంప్ పాల్గొంటారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.

news18-telugu
Updated: February 25, 2020, 10:06 AM IST
Donald Trump India Visit: ఢిల్లీలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్...ఇవాల్టి షెడ్యూల్ ఇదే...
(PTI Photo/Subhav Shukla)
  • Share this:
Donald Trump India Visit: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు తాజ్ మహల్ సందర్శన అనంతరం వారు ఆగ్రా నుంచి ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం వద్ద ట్రంప్ దంపతులకు యూపి గవర్నర్, సిఎం యోగి ఆదిత్యానాథ్ లు వారికి వీడ్కోలు పలికారు. ట్రంప్ బృందం ఢిల్లీ చేరుకుంది. రాత్రి ఢిల్లీలోని హోటల్ ఐటిసి మౌర్యలో ట్రంప్ కుటుంబం బస చేసింది. రాత్రి విశ్రాంతి తీసుకొని ఇవాళ అధికారక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇవాళ  ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు చేసే స్వాగత కార్యక్రమంలో ట్రంప్ పాల్గొంటారు. అనంతరం రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆపై హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఈ సమావేశం అనంతరం ఇరుదేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేసి, సంయుక్త ప్రకటన చేస్తారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో కోవింద్‌తో సమావేశమై, రాత్రి 10గంటలకు అమెరికా తిరుగు ప్రయాణమవుతారు. ఇదిలా ఉంటే మొతెరా స్టేడియంలో భారీ సభలో పాల్గొన్న ఆయన.. ఆ తరువాత ఆగ్రాకు చేరుకున్నారు. సతీమణి మెలానియాతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా తన భర్తతో కలిసి తాజ్‌మహల్ అందాలను వీక్షించారు.

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు