Home /News /national /

NEW CORONAVIRUS VARIANT XE ARRIVES IN INDIA FIRST CASE FOUND IN MUMBAI SAYS MEDIA REPORTS MKS

XE variant: షాకింగ్ న్యూస్ : ఇండియాను తాకిన కరోనా కొత్త వేరియంట్.. ముంబైలో తొలి ఎక్స్ఈ కేసు గుర్తింపు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇది అత్యంత ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. అలాంటి ఎక్స్ఈ వేరియంట్ మహమ్మారి ఇప్పుడు ఇండియాను తాకింది.

రెండేళ్ల తర్వాత కరోనా నుంచి ఉపశమనం లభించిందనుకునేలోపే కొవిడ్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ (variant XE) ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్నది. యూకే, యూరప్ దేశాల్లో ఎక్స్ఈ వేరియంట్ కేసులు వెల్లువలా వస్తున్నక్రమంలో ఇది అత్యంత ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. అలాంటి ఎక్స్ఈ వేరియంట్ మహమ్మారి ఇప్పుడు ఇండియాను తాకింది. కొవిడ్ కొత్త వేరింయట్ ఎక్స్ఈ తొలి కేసును ముంబైలో గుర్తించారు. మొత్తం 376 అనుమానిత శాంపిళ్లను పరీక్షించగా, అందులో ఒకటి XE variant పాజిటివ్ గా తేలినట్లు వెల్లడైంది.

కరోనా వేరియంట్ సరికొత్త రూపం ఎక్స్ఈ ప్రస్తుతం ప్రపంచానికి కొత్త తలపోటుగా మారింది. ఒమిక్రాన్ వేరియంట్ లో ఒకానొక మ్యూటెంగ్ గా కనుగొన్న ఎక్స్ఈని సరికొత్త వేరియంట్ గా గుర్తించడానికి అవసరమైన లక్షణాలన్నీ ఉన్నట్లు వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ.. అన్ని దేశాలను గత వారమే అప్రమత్తం చేసింది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్10 శాతం వేగంగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది.

XE Variant : మళ్లీ కరోనా పీడ.. ఒమిక్రాన్ కంటే వేగంగా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి: WHO వార్నింగ్


ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి యూకే(బ్రిటన్)లో జనవరి 19వతేదీన కనుగొన్నామని, 600 కంటే ఎక్కువ ఎక్స్ఈ కేసులు నిర్దారణ అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఎక్స్ఈ వంటి రీకాంబినెంట్ వేరియంట్‌లకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ రిస్క్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ చెప్పారు. యూకే తర్వాత యూఎస్ లోనూ ఎక్కువ సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయన్నారు.

Telangana Governor: కేంద్రానికి దిమ్మతిరిగే పంచ్!.. KCRపై తమిళిసై విమర్శలు బూమరాంగ్ అయ్యాయా?


ఎక్స్ఈ తీవ్రత, వేగం వంటి లక్షణాలను గుర్తించబడే వరకు ఇది ఓమిక్రాన్ వేరియంట్ లో భాగంగానే వర్గీకరిస్తామమని WHO అధికారులు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ వీ1.1.529, బీఏ 1, బీఏ2 మరియు బీఏ3తో సహా నాలుగు వేరియంట్లను కలిగి ఉంటుందని, ఇందులో బీఏ2 అని పిలవహడే స్టీల్త్ వెర్షన్ కూడా ఉందని, ఇది ఒమిక్రాన్ ప్రారంభ కేసు తర్వాత కొంతమందికి మళ్లీ సోకినట్లు వెల్లడైందని అన్నారు.

KCR విషయంలో కేంద్రం గేరు మార్చిందా? -PM Modiతో భేటీ తర్వాత గవర్నర్ సంచలన వ్యాఖ్యలకు అర్థమేంటి?


కొత్త వేరియంట్‌ ఎక్స్‌ఈ.. గత కోవిడ్‌ మ్యూటెంట్ల కన్నా, వ్యాప్తి అధికంగా ఉండవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ఎక్స్‌ఈ అనేది రీకాంబినెంట్‌.. ఒమిక్రాన్‌ వేరియంట్లు బిఎ1, బిఎ2 నుండి రూపాంతరం చెందింది. ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న బిఎ2 వేరియంట్‌ కన్నా ఎక్స్ఈ వేగం 10 రెట్లు అదనమని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది.

Jogipet జాతిరత్నాలు: తాగిన మైకంలో అబ్బాయికి తాళి కట్టాడు.. వాడేమో కాపురం చేస్తానని ఇంటికొచ్చాడు!


కాగా, ఇండియాలో ఎక్స్ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ (టిఐజిఎస్ డైరెక్టర్) రాకేశ్ మిశ్రా ఇటీవల పేర్కొన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Covid, Mumbai, Omicron

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు