Home /News /national /

NEW CONTROVERSY IN CONGRESS PARTY AFTER CENTRE ANNOUNCED PADMA BHUSHAN AWARD FOR GHULAM NABI AZAD AK

Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్.. కాంగ్రెస్‌లో మొదలైన కొత్త రచ్చ

గులాం నబీ ఆజాద్ (ఫైల్ ఫోటో)

గులాం నబీ ఆజాద్ (ఫైల్ ఫోటో)

Ghulam Nabi Azad: గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన ఆజాద్.. జూన్ 2014 నుంచి ఫిబ్రవరి 2021 మధ్యకాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.

    కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల అంశం కాంగ్రెస్ పార్టీలో కొత్త రచ్చకు తెరలేపింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు ఈ జాబితాలో పద్మ భూషణ్ అవార్డు దక్కడమే ఇందుకు అసలు కారణం. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతల బృందం సభ్యుడిగా ఉన్న గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ అవార్డు రావడంపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు ఈ పురస్కారం దక్కడంపై ఆయనతో పాటు కాంగ్రెస్‌లో అసమ్మతి నేతలుగా చెబుతున్న పలువురు నేతలు స్వాగతించారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కపిల్ సిబల్ గులాం నబీ ఆజాద్‌ను అభినందించారు, మరో జి-23 నేత శశి థరూర్ కూడా ఆజాద్‌ను అభినందించారు. ప్రత్యర్థి ప్రభుత్వం కూడా ఒకరి ప్రజాసేవకు గుర్తింపు పొందడం సంతోషకరమని థరూర్ ట్వీట్ చేశారు.

    అయితే గులాం నబీ ఆజాద్‌కు కేంద్రం ఈ పురస్కారం ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధినాయకత్వానికి సన్నిహితంగా ఉండే మరో సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జైరామ్ రమేశ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఈ అవార్డు పొందిన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాఛార్య పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారనే వార్తలను జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.

    ఇందులో పరోక్షంగా ఆయన గులాం నబీ ఆజాద్‌ను టార్గెట్ చేశారనే చర్చ సాగుతోంది. ఆయన చేయడం సరైనదని.. ఆయన గులాంలా కాకుండా ఆజాద్‌గా ఉండాలనుకుంటున్నారంటూ గులాం నబీ ఆజాద్ కూడా ఈ పురస్కారాన్ని తిరస్కరిస్తే బాగుండేదనే విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే తనకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల గులాం నబీ ఆజాద్ ఇంకా స్పందించలేదు. దీంతో అసలు ఈ అవార్డును ఆయన స్వీకరిస్తారా లేక తిరస్కరిస్తారా ? అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

    Padma Awards: లిటరేచర్, ఎడ్యుకేషన్ రంగంలో విదేశీ సంస్కృత పండితులకు పద్మ అవార్డులు.. గ్రహీతలు ఎవరంటే..

    Padma Awards 2022: పద్మ అవార్డుల ప్రకటన.. బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్, గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్.. పూర్తి వివరాలు

    గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన ఆజాద్.. జూన్ 2014 నుంచి ఫిబ్రవరి 2021 మధ్యకాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. పార్లమెంటు ఎగువ సభలో పదవీకాలం ముగిసిన గులాం నబీ ఆజాద్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఉద్వేగానికి లోనయ్యారు. పార్లమెంట్‌లో ఆజాద్ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Congress, Ghulam Nabi Azad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు