తెలంగాణ (Telangana), ఏపీ (AP) హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తుల (chief justice) నియామకం జరిగింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీష్ చంద్ర శర్మ (Sathish Chandra sharma), ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా (Prashanth Kumar Mishra) నియమితులయ్యారు. ఈ మేరకు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ (Ramnath Kovind) ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (NV ramana) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం (supreme court collegium) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ నియమాకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్వర్వులు (notification) జారీ చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు (kiren rijuju) ట్విటర్లో ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రపతి (President)తో పాటు సీజేఐ (CJI)తో సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకున్నామని మంత్రి కిరణ్ రిజుజు ట్విట్టర్‌లో ప్రకటించారు. ఏపీ, తెలంగాణతో పాటు మరో ఆరు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించారు. 20 రోజుల కిందటే చీఫ్ జస్టిస్‌ల బదిలీ, నియామకాల గురించి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అప్పట్నుంచి పరిశీలనలో ఉంచిన కేంద్రం (central) ఇప్పడు ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఉన్నారు. ఆయన గత జనవరిలోనే ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు. ఇపుడు బదిలీపై చత్తీస్‌ఘడ్ వెళ్తున్నారు. ఆయనతో పాటు తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వచ్చిన హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు.
పూర్తి స్థాయి సీజేలు..
జస్టిస్ హిమా కోహ్లీ (Justice hima kohli) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లినందున ప్రస్తుతం యాక్టింగ్ సీజేగా జస్టిస్ రామచంద్రరావు వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనను కూడా బదిలీ చేశారు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది హైకోర్టులకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌లు ఉన్నారు. అన్ని హైకోర్టులకు పూర్తి స్థాయి సీజేలను సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులన్నింటికీ కేంద్రం ఆమోద ముద్ర (accepted) వేసింది.
చత్తీస్‌ఘడ్ నుంచి ఏపీకి..
ఏపీ హైకోర్టు సీజేగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Prashant kumar Mishra) ప్రస్తుతం చత్తీస్‌ఘడ్ సీజేగా ఉన్నారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీ సీజేను చత్తీస్‌ఘడ్‌కు బదిలీ చేశారు.
In exercise of power conferred under Constitution of India, Hon. President of India, in consultation with Chief Justice of India, is pleased to appoint following Judges as Chief Justices of High Courts along with transfer of following Chief Justices. pic.twitter.com/NRahN3pbKe
— Kiren Rijiju (@KirenRijiju) October 9, 2021
సుప్రీంకోర్టు కొలిజీయం ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి వీలైనంతగా మానవ వనరులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. శరవేగంగా న్యాయమూర్తులను నియమిస్తున్నారు. కేంద్రం విడతల వారీగా నియామకాలకు ఆమోద ముద్ర వేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP High Court, NV Ramana, Supreme Court, Telangana High Court