Home /News /national /

NEW AGRICULTURE REFORMS ACTS FARM LAWS AND THE STUDIED SILENCE OF INDIAS ORIGINAL REFORMS TEAM SK

Agriculture Reform Laws: కొత్త వ్యవసాయ చట్టాలపై ఇంత రచ్చకు అసలు కారణం ఇదేనా..?

ఢిల్లీలో రైతుల ధర్నా (File)

ఢిల్లీలో రైతుల ధర్నా (File)

Agriculture Reform Laws: ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలనుకునే విపక్షాలు.. విపక్షాలను పట్టించుకోకుండా, వారిని ఒప్పించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వాలు ఉన్నంత కాలం.. మనదేశ పరిస్థితి ఇలాగే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి ...
  ఢిల్లీ శివారులో జరుగుతున్న రైతుల ఆందోళనపైనే ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. 18 రోజులుగా వేలాది మంది రైతులు రాజధాని శివారులోనే బైఠాయించారు. అక్కడే తింటున్నారు. అక్కడే నిద్రిస్తున్నారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేదని తెగేసి చెబుతున్నారు. రోజుకో రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. రైతుల ఆందోళనలకు విపక్షాలు, ప్రజా సంఘాలు, పలువురు సినీ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు కేంద్రం మాత్రం చట్టాలను రద్దుచేసే ప్రసక్తే లేదని.. రైతుల ఆందోళనలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లాయని కేంద్రమంత్రులు విమర్శిస్తున్నారు. విపక్షాల ఉచ్చులో పడవద్దని రైతులకు సూచిస్తున్నారు. ఐతే కొన్ని రైతు సంఘాలు మాత్రం కేంద్రానికి మద్దతు తెలుపుతూ.. కొత్త చట్టాలను సమర్థిస్తున్నాయి.

  వ్యవసాయ సంస్కరణలుగా కేంద్రం చెబుతున్న ఈ చట్టాలపై ఎందుకిచ్చ రచ్చ జరుగుతోంది? లోపం ఎక్కడుంది? దీనిపై క్లారిటీ రావాలంటే ఒకసారి 1991లోకి వెళ్లాలి. 1991లో భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయింది. ఆ సమయంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కీలకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. పంచ వర్ష ప్రణాళిక, ప్రభుత్వ రంగాలకు ప్రాధాన్యం, ప్రైవేట్ రంగ నియంత్రణకు పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం, బహుళజాతి సంస్థలపై ఆంక్షలు, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలను ప్రభుత్వ నియంత్రణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. 1991 జులై 24న ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌‌లో మాట్లాడుతూ 'మన ఆలోచనను అమలు పరిచే సమయం వస్తే భూమ్మీద ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు' అనే విక్టర్ హ్యూగో వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు.

  అంతేకాదు 2012లో యూపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. అప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు మిన్నంటాయి. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆందోళనలు తగ్గిపోయాయి. 1991లో ఆర్థిక సంస్కరణలు, 2012లో ఆర్థిక వ్యవస్థ కోసం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన మన్మోహన్ సింగ్ వంటి వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా వ్యవసాయ సంస్కరణ వల్ల రైతులకు కలిగే లాభాలను ఆలోచించకుండా.. రాజకీయ లబ్ధి కోసమే రైతులను కేంద్రంపైకి ఎగదోస్తోందని బీజేపీ నేతలు, పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  మన దేశంలో పార్టీల మధ్య భేదాలు.. చట్టాలు చేసే సమయంలో ఇబ్బందిగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారపక్షం, విపక్షాలు కలిసి కూర్చొని.. పరస్పర అవగాహనతో.. చట్టాలను రూపొందించడం లేదని.. అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలనుకునే విపక్షాలు.. విపక్షాలను పట్టించుకోకుండా, వారిని ఒప్పించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వాలు ఉన్నంత కాలం.. మనదేశ పరిస్థితి ఇలాగే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు.

  సంస్కరణలు తెచ్చినప్పుడు సహజంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని.. వాటిని అర్ధం చేసుకునేలా అవగాహన కల్పించాలే తప్ప, మీరెంతంటే మీరెంత? అనుకుంటే ఏదీ సాధ్యం కాదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు కొట్టుకోకూడదని సూచిస్తున్నారు. కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి వ్యతిరేకతే వచ్చిందని.. కానీ ఇప్పుడు పరిస్థితేంటో అందరికీ తెలుసు కదా అని అభిప్రాయపడుతున్నారు.

  కాగా, రైతుల సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. కేంద్రం చెప్పిన ఏ ప్రతిపాదనకూ రైతులు అంగీకరించడం లేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఆ మూడు చట్టాలను రద్దుచేసే ప్రకస్తే లేదని తేల్చిచెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే చట్టాలను తెచ్చామని.. అపోహలతో ఆందోళనలు చేయడం సరికాదని సూచిస్తోంది. ఐతే డిసెంబరు 19లోపు చట్టాలను రద్దు చేయాలని.. లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రైతు సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Farmers, Farmers Protest, New Agriculture Acts

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు