NEW AGRICULTURE ACTS WILL STAY IMPLEMENTATION OF FARM LAWS IF GOVT DOES NOT SAYS SUPREME COURT SK
Agri Acts: వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. నిలిపివేస్తారా? లేదా?
ఆందోళన చేస్తున్న రైతులు (Image: PTI)
Farmers Protest: ప్రభుత్వం, రైతులు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలిగే వరకు.. కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధించాలనుకుంటున్నట్లు తెలిపింది. వ్యవసాయ చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేయకపోతే.. మేం స్టే విధిస్తామని సీజేఐ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
కొత్త వ్యవసాయ చట్టాలపై రగడ కొనసాగుతోంది. ఓ వైపు ఢిల్లీ శివారులో వేలాది రైతులు ఆందోళన చేస్తుండగా.. మరోవైపు సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించింది. ప్రభుత్వం, రైతులు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలిగే వరకు.. కొత్త వ్యవసాయ చట్టాలపై స్టే విధించాలనుకుంటున్నట్లు తెలిపింది. వ్యవసాయ చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేయకపోతే.. మేం స్టే విధిస్తామని సీజేఐ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
రైతుల ఆందోళనల్లో మహిళలు, వృద్ధులు కూడా పాల్గొంటున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. కొంత మంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారని కోర్టు వెల్లడించింది. రైతు సంఘాలతో అసలు ఏం చర్చిస్తున్నారో అర్ధం కావడం లేదని.. ఏదైనా తప్పు జరిగితే అందరూ బాధ్యత వహించాల్సి వహిస్తుందని తెలిపింది. తమ చేతులకు రక్తం అంటుకోవాలని తాము కోరుకోవడం లేదని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశమంతా తిరుగుబాటు చేస్తోందని సీజేఐ బాబ్డే అన్నారు. ఎకానమీ విషయంలో తాము నిపుణులము కాదని.. కానీ చట్టాల ప్రయోజనకరమని చెప్పేందుకు ఒక్క ఉదాహరణ కూడా కనిపించడం లేదని స్పష్టం చేశారు.
చట్టాలను రద్దు చేయాలని తాము చెప్పడం లేదని.. సమస్యను పరిష్కరించమని మాత్రమే చెబుతున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తామని తెలిపింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఐతే కొత్త వ్యవసాయ చట్టాలపై కమిటీ ఏర్పాటుకు సంబంధించి.. ఇవాళ లేదా రేపు తీర్పు వెలువరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కోర్టు వ్యాఖ్యలను విపక్షాలు స్వాగతించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని.. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.