Farmers Protest: కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీ క్లారిటీ.. ఏం చెప్పారంటే..

ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi on Agriculture Acts: భారత రైతులు ఇప్పుడు మండిలతో పాటు బయటి ప్రాంతాల్లోనూ తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని ప్రధాని మోదీ అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చిన స్పష్టం చేశారు.

  • Share this:
    కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ స్పందించారు. వ్యవసాయ చట్టాలపై మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. భారత రైతులు ఇప్పుడు మండిలతో పాటు బయటి ప్రాంతాల్లోనూ తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని ప్రధాని మోదీ అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చిన స్పష్టం చేశారు. శనివారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) 93వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.

    ఈ సందర్భంగా కొత్త వ్యవసాయ చట్టాలపై మాట్లాడుతూ.. ''ఇవాళ భారతీయ రైతులు తమ ఉత్పత్తులను మండిలతో పాటు బయట కూడా అమ్ముకోవచ్చు. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ తమ ధాన్యాన్ని అమ్ముకునే వెసులుబాటు కల్పించాం. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ఈ చట్టాలను తీసుకొచ్చాం.'' అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

    మరోవైపు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని రైతులు నిర్ణయించారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రేపు జైపూర్- ఢిల్లీ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఎల్లుడి సింఘు సరిహద్దులో నిరాహార దీక్షను చేయబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 19 లోపు తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని. కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని తెగేసి చెప్పారు.

    రైతుల సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. కేంద్రం చెప్పిన ఏ ప్రతిపాదనకూ రైతులు అంగీకరించడం లేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఆ మూడు చట్టాలను రద్దుచేసే ప్రకస్తే లేదని తేల్చిచెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే చట్టాలను తెచ్చామని.. అపోహలతో ఆందోళనలు చేయడం సరికాదని సూచిస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: