NETWORK18 INITIATIVE BUTTON DABAO DESH BANAO THINGS EVERY INDIAN NEEDS TO KNOW ABOUT THE IMPORTANCE OF VOTING SS
Election 2019: ఓటు ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకోవాల్సిన అంశాలివే
Election 2019: ఓటు ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకోవాల్సిన అంశాలివే
Network18 initiative-Button Dabao Desh Banao | ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఓటు ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 అంశాలివే.
భారతదేశంలో 17వ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలివి. ఇప్పటికీ 100% ఓటింగ్ సాధించలేకపోతోంది భారతదేశం. రాజకీయాలు ప్రజల్ని ఎప్పుడూ అయోమయానికి గురిచేసే అంశమే. పేదరికాన్ని నిర్మూలించడం, విద్య, ప్రాథమిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, వృద్ధులకు ప్రణాళికలు... ఇలా అన్ని అంశాలపై మన ఆలోచన ఏంటన్నది నిర్ణయించడం అందరి విధి. మనల్ని ఎవరు పాలించాలన్నది నిర్ణయించే అవకాశం కల్పించేవే ఎన్నికలు. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఓటు ప్రాముఖ్యత గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 అంశాలివే.
1. ఓటింగ్ అంటే మీకోసం, మీరు అభిమానించే వ్యక్తుల కోసం, దేశప్రగతి కోసం, మీరు నిలబడటం. అలాంటప్పుడు మీరే ఓటు వేయకపోతే మరి ఇంకెవరు వేస్తారు?
2. ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత ఎన్నుకోబడేదే ప్రభుత్వం. అందుకే ప్రజలు ప్రేక్షకపాత్రను వీడాలి. ఫిర్యాదుదారులుగా, విమర్శకులుగా ఉండిపోకూడదు. ప్రజాస్వామ్యంలో భాగస్వాములవ్వాలి.
3. అన్నింటినీ అరచేతిలోకి తీసుకొచ్చింది ఇంటర్నెట్. అన్ని వ్యవహారాలు ఎలా సాగుతాయి, మీ అభ్యర్థులు ఎవరు, వాళ్ల ప్రణాళికలేంటీ అన్నవి తెలియకపోతే తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. చదవండి. స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని అడగండి. వార్తలు చూడండి. గతంతో పోలిస్తే ఈ రోజుల్లో సమాచారం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎలాంటి సాకులు వెతకాల్సిన అవసరం లేదు.
4. ఓటు వేసే విషయంలో నేటి యువతరం ఉదాసీనతను చూపిస్తోంది. కానీ వారి భవిష్యత్తును నిర్ణయించాల్సింది వాళ్లే. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు ఎన్నుకునే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఒక్క కారణం చాలు ఎన్నికల్లో పాల్గొనడానికి.
5. ఇప్పటికీ ఓటు హక్కు లేక ప్రభుత్వాలను ఎన్నుకోలేకపోతున్న దేశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఓటు వేయడం మన హక్కు. ఈ హక్కు కోసమే మన పూర్వీకులు ఎన్నో పోరాటాలు చేశారు. మనకు లభించే ప్రతీ అవకాశాన్ని స్వచ్ఛందంగా అందిపుచ్చుకోవాలి.
దేశంలో మే 12న ఆరో దశ, మే 19న ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 17వ లోక్‌సభ పోలింగ్ ముగిసిపోతుంది. మే 23న ఫలితాలు వెలువడతాయి. ఇదొక్కటే కాదు ప్రతీ ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సంకల్పంతో 'బటన్ దబావో దేశ్ బనావో' పేరుతో ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ సహకారంతో Network18 చేపట్టిన కార్యక్రమం ఇది. సోషల్ మీడియాలో #ButtonDabaoDeshBanao హ్యాష్‌ట్యాగ్ ద్వారా ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో మీరూ పాల్గొనొచ్చు.
Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.