Network18: రోజుకు 10 కోట్ల వీక్షకులతో నెట్‌వర్క్18 గ్రూప్ రికార్డ్

Network18 | బార్క్ రేటింగ్స్ ప్రకారం యావరేజ్ డైలీ న్యూస్ రీచ్ 34 శాతం ఉంటే నెట్‌వర్క్18 మాత్రం 50 శాతం యావరేజ్ డైలీ రీచ్‌ను అందుకుంది.

news18-telugu
Updated: March 30, 2020, 5:03 PM IST
Network18: రోజుకు 10 కోట్ల వీక్షకులతో నెట్‌వర్క్18 గ్రూప్ రికార్డ్
Network18: రోజుకు 10 కోట్ల వీక్షకులతో నెట్‌వర్క్18 గ్రూప్ రికార్డ్
  • Share this:
నెట్‌వర్క్18 గ్రూప్ రోజూ 10 కోట్ల మంది వీక్షకులతో రికార్డ్ సృష్టించింది. బార్క్-నీల్సన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. భారతదేశమంతా టీవీ న్యూస్ వృద్ధి 57 శాతం ఉండటం విశేషం. అన్ని భాషల్లో ఇదే మార్పు కనిపించింది. బార్క్ రేటింగ్స్ ప్రకారం యావరేజ్ డైలీ న్యూస్ రీచ్ 34 శాతం ఉంటే నెట్‌వర్క్18 మాత్రం 50 శాతం యావరేజ్ డైలీ రీచ్‌ను అందుకుంది. కరోనా వైరస్ ప్రభావం మొదలైన మొదటి వారంలో ప్రైమ్‌టైమ్ వ్యూయర్‌షిప్‌లో నెట్‌వర్క్18 గ్రూప్ 54 శాతం వృద్ధిని అందుకుంది. టీవీ వ్యూయర్స్ లెక్క తీసుకుంటే నెట్‌వర్క్18 గ్రూప్ రోజూ 10 కోట్ల మందిని చేరుకుంది. నాన్ ప్రైమ్ టైమ్ స్లాట్స్‌లో వ్యూయర్‌షిప్ కూడా పెరిగింది. నెట్‌వర్క్18 వ్యూయర్‌షిప్ నాన్-ప్రైమ్ టైమ్ స్లాట్స్‌లో 53 శాతం, ఆఫ్టర్‌నూన్ నాన్ ప్రైమ్‌టైమ్ స్లాట్స్‌లో 74 శాతం పెరిగింది. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో చిన్నచిన్న పట్టణాల్లో కూడా వ్యూయర్‌షిప్ పెరిగింది. న్యూస్ యాప్స్‌లో వార్తల వినియోగం 76 శాతం, న్యూస్ అగ్రిగేటర్ యాప్స్ వినియోగం 22 శాతం పెరిగింది.

లాక్‌డౌన్ కొనసాగుతున్నందున టీవీ వార్తల వ్యూయర్‌షిప్ ఇంకా పెరుగుతుంది. ప్రజలకు వారి ఫోన్లలోనే వార్తలు వస్తున్నాయి. కానీ కచ్చితత్వాన్ని తెలుసుకునేందుకు టీవీ చూస్తున్నారు. అందుకే ప్రైమ్‌టైమ్ కన్నా నాన్ ప్రైమ్ టైమ్ గ్రోత్ ఎక్కువగా ఉంది.
సునీల్ లుల్లా, బార్క్ ఇండియా సీఈఓ


టీవీ, స్మార్ట్‌ఫోన్లలో వార్తల వినియోగం ఎలా పెరిగిందని బార్క్, నీల్సన్ అధ్యయనం జరిపాయి. కరోనా మహమ్మరి కారణంగా వార్తల వినియోగం బాగా పెరిగింది. ఇటీవల కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం అత్యధికంగా చూసిన వార్తాంశంగా నిలిచింది.
ఇక మార్చి 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటనను చూసినవారి సంఖ్య 2019 ఐపీఎల్ ఫైనల్ చూసినవారి కంటే ఎక్కువ. 13.3 కోట్ల మంది ఈ ప్రసంగాన్ని చూశారు. బార్క్-నీల్సన్ డేటా ప్రకారం మోదీ 30 నిమిషాల ప్రసంగాన్ని 201 టీవీ ఛానెళ్లలో 19.7 కోట్ల మంది చూశారు. మొత్తం 389.1 కోట్ల నిమిషాలు. గతేడాది ఆగస్ట్ 8న ఆర్టికల్ 370 ప్రకటనను 163 ఛానెళ్లలో 6.5 కోట్ల మంది చూశారు. మొత్తం 93.4 కోట్ల నిమిషాలు.

ఇవి కూడా చదవండి:

Jan Dhan Account: జన్ ధన్ అకౌంట్‌లోకి డబ్బులు... బ్యాంకులకు ఈ సమస్యలు

Indian Railways: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్‌పై క్లారిటీ ఇచ్చిన రైల్వే

EPF Withdrawal: ఈపీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి... కొత్త రూల్స్ ఇదే
First published: March 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading