మే 23న 56.2 మిలియన్ యూజర్లు... టైమ్స్ ఇంటర్నెట్‌ను వెనక్కినెట్టిన నెట్‌వర్క్18 డిజిటల్

#AheadOfTimes | మే 23న రెండు నిర్ణయాత్మకమైన తీర్పుల్ని ఇచ్చింది భారతదేశం. లోక్‌సభలో బీజేపీకి ఇచ్చిన తీర్పు ఒకటైతే, నెట్‌వర్క్18 డిజిటల్‌కు ఇచ్చిన తీర్పు మరొకటి.

news18-telugu
Updated: May 29, 2019, 7:09 PM IST
మే 23న 56.2 మిలియన్ యూజర్లు... టైమ్స్ ఇంటర్నెట్‌ను వెనక్కినెట్టిన నెట్‌వర్క్18 డిజిటల్
మే 23న 56.2 మిలియన్ యూజర్లు... టైమ్స్ ఇంటర్నెట్‌ను వెనక్కినెట్టిన నెట్‌వర్క్18 డిజిటల్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఒక ఎన్నికల తర్వాత మరో ఎన్నికలు... ఎన్నికల ఫలితాల్లో వేగం, కచ్చితత్వంతో కవరేజీలో Network18 Digital కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున నెట్‌వర్క్18 డిజిటల్ వెబ్‌సైట్లను 56.2 మిలియన్ యూజర్లు చూడటం ఓ రికార్డ్. అంటే 5 కోట్ల 62 లక్షల మంది యూజర్లు. ఈ రికార్డుతో టైమ్స్ ఇంటర్నెట్‌ను వెనక్కి నెట్టింది నెట్‌వర్క్18 డిజిటల్. మే 23న తమ యూజర్ల సంఖ్య 55 మిలియన్ అని టైమ్స్ ఇంటర్నెట్ స్వయంగా వెల్లడించింది. కాబట్టి ఈ లెక్కలో నెట్‌వర్క్18 డిజిటల్ టైమ్స్ ఇంటర్నెట్‌ కన్నా ముందుంది.

నెట్‌వర్క్18 డిజిటల్‌లోని News18.com, Firstpost.com, Moneycontrol.com, CNBCTV18.com వెబ్‌సైట్లు, టైమ్స్ ఇంటర్నెట్‌ గ్రూప్‌లోని టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనమిక్ టైమ్స్, నవభారత్ టైమ్స్, టైమ్స్ నౌ వెబ్‌సైట్లను దాటెయ్యడం విశేషం. క్షేత్రస్థాయిలో వేలాది మంది జర్నలిస్టులు, అత్యధునాతన వెబ్‌సైట్, డిజైన్, టెక్నాలజీతో మరే ఇతర ఎన్నికలతో పోల్చలేని స్థాయిలో అత్యుత్తమ ఎన్నికల ఫలితాల కవరేజీని అందించింది నెట్‌వర్క్18 డిజిటల్. News18.com భారతదేశంలోనే వివిధ భాషల్లో వార్తల్ని అందిస్తున్న అతిపెద్ద సంస్థ. మొత్తం 12 భాషల్లో వెబ్‌సైట్స్ ఉన్నాయి. Firstpost భారతదేశంలోనే ముందంజలో ఉన్న ఒపీనియన్ వెబ్‌సైట్. Moneycontrol దేశంలోనే డిజిటల్ బిజినెస్ డెస్టినేషన్.మే 23న ఎన్నికల ఫలితాల రోజున నెట్‌వర్క్18 డిజిటల్ మరే ఇతర వార్తాసంస్థలతో సరిపోలని అత్యుత్తమ స్థాయిలో కవరేజీ అందించింది. ఇన్నోవేటీవ్ ఎలక్షన్ రిజల్ట్ డిస్‌ప్లే, ఇంటరాక్టీవ్ డేటా అనలిటిక్స్ లాంటివాటితో ముందంజలో నిలిచింది. ప్రతీ ఎన్నికల్లో అందరికంటే ముందుగా ఎన్నికల ఫలితాలను అందిస్తుందన్న పేరు Network18 సంస్థకు ఉంది. ఆ నమ్మకం, విశ్వాసమే మరోసారి ప్రతిబింబించి రికార్డులు బద్దలుగొట్టే నెంబర్లు ఇచ్చేందుకు కారణమైంది.మే 23న రెండు నిర్ణయాత్మకమైన తీర్పుల్ని ఇచ్చింది భారతదేశం. లోక్‌సభలో బీజేపీకి ఇచ్చిన తీర్పు ఒకటైతే, నెట్‌వర్క్18 డిజిటల్‌కు ఇచ్చిన తీర్పు మరొకటి. ఆరోజున నెట్‌వర్క్18 డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అన్నీ భారత ప్రజల దృష్టిని ఆకట్టుకోగలిగాయి.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో

ఇవి కూడా చదవండి:

Budget Smartphones: బడ్జెట్ ఫోన్ కావాలా? రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే...

PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?

Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండి
First published: May 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు