Mission Paani | నీటి సంరక్షణ కోసం నెట్‌వర్క్ 18 గ్లోబల్ క్యాంపెయిన్

స్టాక్‌హోంలో నిర్వహించిన మిషన్ పానీ గ్లోబల్ లాంచ్ ప్రోగ్రాం

ఆగస్ట్ 27న ముంబైలో ప్రారంభమైన మిషన్ పానీ ప్రోగ్రాం, ఆగస్ట్ 29న స్టాక్ హోమ్‌లో ప్రపంచ నీటి వారోత్సవాల్లో గ్లోబల్‌గా లాంచ్ అయింది.

 • Share this:
  ప్రపంచంలో 200 కోట్ల మంది నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. జనాభా పెరుగుతున్న కొద్దీ నీటి కోసం డిమాండ్ ఉధృతం అవుతుంది. దీంతోపాటు వాతావరణ మార్పుల వల్ల నీటి సమస్య తీవ్రం అవుతుంది. ప్రపంచంలో 17 శాతం జనాభా కలిగిన భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్నారు. భారత్‌లో ప్రస్తుతం 60 కోట్ల మంది నీటి ఎద్దడిని ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. ఏటా 2లక్షల మంది సురక్షిత నీరు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్‌లో ప్రతి మూలకూ అభివృద్ధిని తీసుకెళ్లాలని సంకల్పించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం నీటి సంరక్షణ కోసం జలశక్తి అభియాన్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నడుం బిగించింది. భారత్‌లో భిన్నత్వాల సమ్మిళితమైన మీడియాగా ఉన్న నెట్ వర్క్ 18, హార్పిక్ లాంటి హైజీన్ ఉత్పత్తుల తయారీ సంస్థ అయిన రెకిట్ బెంకిసెర్, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌తో కలసి మిషన్ పానీ అనే క్యాంపెయిన్‌ను దేశవ్యాప్తంగా చేపట్టింది. దేశంలోని నలుమూలల ఉండే ప్రజలను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి.. వారిని జల ఉద్యమంలో భాగం చేస్తుంది. వారితో జల ప్రతిజ్ఞలు చేయించడం ద్వారా జల రక్షక్‌లుగా మారుస్తుంది.

  ఆగస్ట్ 27న ముంబైలో ప్రారంభమైన మిషన్ పానీ ప్రోగ్రాం, ఆగస్ట్ 29న స్టాక్ హోమ్‌లో ప్రపంచ నీటి వారోత్సవాల్లో గ్లోబల్‌గా లాంచ్ అయింది. ఈ గ్లోబల్ లాంచ్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జలశక్తి శాఖ కార్యదర్శి పరమ్ అయ్యర్, ఆర్బీ హైజీన్ &హోమ్ దక్షిణాసియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహన్ ఈశ్వర్, స్వీడన్ వాటర్ హౌస్, ఇంటర్నేషనల్ పాలసీ (SIWI) డైరెక్టర్ కేటరీనా వీమ్, water.org మేనేజింగ్ డైరెక్టర్ వేదికా భండార్కర్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి వారోత్సవాలను SIWI నిర్వహిస్తుంది. భూమ్మీద నీటి సమస్య, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద చర్చిస్తుంది. నీటి కొరతను తీర్చే కొత్త కొత్త విధానాలను అమలు చేయడం, పర్యావరణం, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన వంటి అంశాల మీద ఆగస్ట్ 25 నుంచి ఆగస్ట్ 30 వరకు చర్చిస్తుంది. ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ ప్రపంచ నీటి వారోత్సవాల్లో 135 దేశాల నుంచి 3300 మంది ప్రతినిధులు, 370 సంస్థలు పాల్గొన్నాయి.

  నీటి సంరక్షణ కొరకు ఆచరణయోగ్యమైన విధానాల మీద నెట్‌వర్క్ 18 ఈ ప్రపంచ నీటి వారోత్సవాల్లో ప్రచారం చేస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన దేశాల్లో మిషన్ పానీ మీద అవగాహన కల్పిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న నీటి సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సంయుక్తంగా ఏం చేస్తే బాగుంటుందనే అంశంపై వారి అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ జలశక్తి అభియాన్ త్వరలోనే ఓ ఉద్యమరూపం దాలుస్తుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. నెట్‌వర్క్ 18 - హార్పిక్ సంయుక్తంగా మిషన్ పానీ రూపంలో జలశక్తి అభియాన్‌తో కలవడం అభినందనీయమన్నారు.

  నెట్‌వర్క్ 18 మార్కెటింగ్ ప్రెసిడెంట్, ఫోర్బ్స్ ఇండియా సీఈవో ప్రియాంకా కౌల్ మాట్లాడుతూ.. ఇండియాలో ప్రస్తుతం మనం అవలంభిస్తున్న నీటి సంరక్షణ విధానాలను మార్చాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ పిలుపుతో.. ఈ నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఓ ప్రజా ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జల ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నెట్ వర్క్ 18 - హార్పిక్ సంయుక్తంగా మిషన్ పానీ పేరుతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి అయిన అమితాబ్ బచ్చన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపెయిన్‌లో సహకారం అందిస్తున్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
  First published: