HOME »NEWS »NATIONAL »netizens praise a woman traffic police constable who sweeps road to remove broken glasses after accident in pune nk

ప్రమాదంలో రోడ్డుపై పడిన గాజు పెంకులు. ఊడ్చిన మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్. నెటిజన్ల హర్షం

ప్రమాదంలో రోడ్డుపై పడిన గాజు పెంకులు. ఊడ్చిన మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్. నెటిజన్ల హర్షం
ప్రమాదంలో రోడ్డుపై పడిన గాజు పెంకులు. ఊడ్చిన మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్. నెటిజన్ల హర్షం (credit - twitter)

Woman traffic police: ఎవరెలా పోతే మాకేంటి... మా పనైపోయిందా లేదా అనుకునే రోజులివి. ఆ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం అందరి క్షేమం కోసం చీపురు పట్టింది. అందరి మన్ననలూ పొందుతోంది.

  • Share this:
    గాజు పెంకు చిన్నదైనా చాలు... దాని వల్ల కలిగే నష్టం చాలా ఎక్కువే ఉంటుంది. అలాంటి గాజు పెంకులు రోడ్డుపై ఉండటంతో... ఆ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్... వాహనదారులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో... తనే స్వయంగా చీపురు పట్టి... వాటిని రోడ్డు పక్కకు ఊడ్చేశారు. ఈ ఘటన మహారాష్ట్ర... పుణెలోని తిలక్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. అంతకు ముందే అక్కడో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ బైకుకి చెందిన గాజు పెంకులు, ఫైబర్ ముక్కలు రోడ్డుపై పడ్డాయి. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ అమల్దార్ రజియా సయ్యద్ ఊడుస్తున్నప్పుడు వాహనదారులెవరూ పట్టించుకోలేదు. ఓ వ్యక్తి మాత్రం చూశారు. వెంటనే తన మొబైల్‌తో వీడియో తీసి... సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ ఘటన వైరల్ అయ్యింది.

    మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ ఈ ఘటనను పరిగణనలోకి తీసుకున్నారు. దీన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. "పౌరులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో అమల్దార్ రజియా సయ్యద్ చీపురు పట్టి... గాజు పెంకులను ఊడ్చివేయడం గొప్ప విషయం. ఆమె చేసిన ఈ పనిని అభినందిస్తున్నాను" అని పోస్టుతోపాటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ని పుణె సిటీ పోలీసులు, పుణె సిటీ సీపీకి ట్యాగ్ చేశారు.



    రజియా ఇలా ఊడ్వకుండా తన డ్యూటీ తాను చేసుకుపోయినా ఎవరూ ప్రశ్నించరు. మర్నాడు సఫాయీ కర్మచారీలు రోడ్డును ఊడ్చేవారు. కానీ ఈ లోగా ఆ పెంకులు ఎన్ని వాహనాలకు ఇబ్బంది కలిగిస్తాయో, ఎన్ని సెప్టిక్‌లకు కారణమవుతాయో చెప్పలేం. అందరి మేలూ కోరిన ఆమె వీడియోను చూసిన నెటిజన్లంతా ఆమెను మెచ్చుకుంటున్నారు.



    ఇది కూడా చదవండి: Zodiac signs: ఏ రాశి వారికి ఎలాంటి భయాలు ఉంటాయి... తెలుసుకోండి

    ప్రస్తుతం అమల్దార్ రజియా సయ్యద్... పుణెలో ఖడక్ ట్రాఫిక్ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:January 20, 2021, 12:48 IST