హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Viral: ట్రాఫిక్ రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తున్నారని అడిగితే..? నెటిజన్ల సమాధానాలకు నవ్వాపుకోలేరంతే..! ఆ కారణాలకైతే అవాక్కవ్వాల్సిందే..!!

Viral: ట్రాఫిక్ రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తున్నారని అడిగితే..? నెటిజన్ల సమాధానాలకు నవ్వాపుకోలేరంతే..! ఆ కారణాలకైతే అవాక్కవ్వాల్సిందే..!!

గర్ల్‌ఫ్రెండ్ రమ్మంది అందుకే సిగ్నల్ బ్రేక్ చేశానంటున్న నెటిజన్.

గర్ల్‌ఫ్రెండ్ రమ్మంది అందుకే సిగ్నల్ బ్రేక్ చేశానంటున్న నెటిజన్.

వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) ఉల్లంఘిస్తూ పోలీసులకు దొరికితే వింత కారణాలు చెబుతారు. తాజాగా ఢిల్లీ పోలీస్ (Delhi Police) డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ ఇలాంటి సాకుల గురించే నెటిజన్లను అడిగింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

సాధారణంగా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) ఉల్లంఘిస్తూ పోలీసులకు దొరికితే... "తప్పయింది సార్, ఇంకోసారి ఇలా జరగదు" అని ప్రాధేయపడతారు. లేదా ఫలానా డాక్యుమెంట్/హెల్మెట్ మర్చిపోతే.. "ఈ ఒక్కసారి వదిలేయండి, ప్లీజ్" అని బతిమిలాడుతుంటారు. అయితే కొందరు మాత్రం భలే క్రియేటివ్‌గా సాకులు (Creative Excuses) చెప్పి పోలీసులను సైతం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తారు. తాజాగా ఢిల్లీ పోలీస్ (Delhi Police) డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ ఇలాంటి సాకుల గురించే నెటిజన్లను అడిగింది. "నిబంధనలను ఉల్లంఘించిన (Violating Rules) తర్వాత మీరు ట్రాఫిక్ పోలీసులకు చెప్పిన అత్యంత చమత్కారమైన సాకులు ఏంటి?" అని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా అడిగారు. దాంతో నెటిజన్లు ఈ ట్వీట్ కింద తాము తెలివిగా, చమత్కారంగా చెప్పిన సాకులేంటో తెలియజేస్తూ అందరి చేత నవ్వులు పూయిస్తున్నారు.

ఒకరేమో "నా లవర్ వెయిట్ చేస్తుంద"ని చెబితే మరొకరేమో "గర్భవతిని కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోలే" అని అబద్ధాలు చెప్పారట. తన లైసెన్స్ కార్డును కుక్క తినేసిందని చెప్పినట్లు ఓ యూజర్ పేర్కొనగా ఆ రిప్లై అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. ఇంకా ఇలాంటి మరెన్నో నవ్వించే సాకులు చెప్పారు నెటిజన్లు. వాటిపై ఓ లుక్కేద్దాం.

https://twitter.com/DelhiPolice/status/1545304767387561984?t=aU-M2BWo8C5OaFt2cv7tMA&s=19

సాధారణంగా డ్రైవింగ్ లైసెన్సు లేదా మరే ఇతర డాక్యుమెంట్లు చూపించకపోతే పోలీసులు జరిమానా విధిస్తారు. హెల్మెట్ పెట్టుకోకపోయినా, తదితర ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా ఫైన్ చెల్లించుకోక తప్పదు. అయితే కొందరు మాత్రం జరిమానా నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు విచిత్రమైన కారణాలు లేదా అబద్ధాలు చెబుతుంటారు. ఢిల్లీ పోలీసులు ఇలాంటి సాకుల గురించి తమతో పంచుకోవాలని అడగారు. దీంతో నెటిజన్లు తాము చెప్పిన చాలా హాస్యాస్పదమైన సాకులను ఢిల్లీ పోలీసుల ట్వీట్‌కు రిప్లైగా ఇస్తున్నారు.

ఒక యూజర్ "కుక్క నా డ్రైవింగ్ లైసెన్స్‌ను తిన్నది"అని చెప్పారట. ఇంకొక యూజర్... “సర్, నా గర్ల్‌ఫ్రెండ్ వెయిటింగ్ చేస్తోంది. త్వరగా వెళ్లకపోతే బ్రేకప్ చెప్తుంది" అని ట్రాఫిక్ పోలీస్‌లకి చెప్పారట. అలా చెప్పినా ప్రతిసారీ పోలీసులు జరిమానా విధించకుండా జాగ్రత్తగా పో, బాబూ అని పంపించారట. ఇంకొక యూజర్ “సార్, ఇది నా మొదటి సారి, మళ్లీ జరగదు" అని చెబితే వదిలేశారట. మరొక యూజర్ రిప్లై ఇస్తూ.. "హెల్మెట్ లేకుండా మేం ఒకరోజు పోలీసులకు రెడ్ హ్యండెడ్‌గా దొరికాం, బండి మీద కూర్చున్న మాలోని ఒకరు సార్, మేం విద్యార్థులం.. మా దగ్గర డబ్బు లేదని చెప్పారు" అని పేర్కొన్నారు. "నేను హెల్మెట్ లేకుండా పట్టుబడినప్పుడు... నా తల్లికి అనారోగ్యంగా ఉంది, మందులు కొనడానికి వెళుతున్నాను" అని చెప్పినట్లు మరొక వినియోగదారు తన అనుభవాన్ని పంచుకున్నారు. "సీట్ బెల్ట్ ధరించలేను, గర్భంతో ఉన్నాను" అని సాకు చెప్పినట్లు ఒక మహిళ బదులిచ్చారు.

కొందరు తమ స్నేహితులు లేదా ప్రియమైనవారు పోలీసులకు చెప్పిన సాకులను కూడా పంచుకున్నారు. ఈ రిప్లైలు వేరే లెవెల్‌లో నెటిజన్లను నవ్విస్తున్నాయి. ఒక యూజర్ రిప్లై ఇస్తూ.. "నా స్నేహితుడు చెప్పిన సాకు ఇది: సర్, నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె హౌజ్ ఖాస్‌లో తన ప్రేమికుడితో సరసాలు ఆడుతోంది" అని పేర్కొన్నారు. కొంతమంది యూజర్లు ఢిల్లీ పోలీసుల ప్రవర్తనపై కూడా ఫిర్యాదు చేశారు. అకారణంగానే ఢిల్లీ పోలీసులు జరిమానాలు విధించినట్లు ఈ ట్వీట్ కింద రిప్లై ఇచ్చారు. కాగా నెటిజన్లు చెప్పిన సాకులన్నీ బాగా నవ్విస్తున్నాయి.

First published:

Tags: Netizen, TRAFFIC AWARENESS, Traffic police, Traffic rules

ఉత్తమ కథలు