NETAJI SUBHAS CHANDRA BOSES BIRTHDAY TO BE CELEBRATED AS PARAKRAM DIWAS SK
Netaji Subhas Chandra Bose: బెంగాల్ ఎన్నికల వేళ.. నేతాజీ జయంతిపై కేంద్రం కీలక నిర్ణయం..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (ఫైల్ ఫొటో)
నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజున బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి నివాళిగా పాదయాత్ర నిర్వహించే యోచనలో ఉన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు సిద్ధమయింది. నేతాజీ పుట్టిన రోజైన జనవరి 23న ప్రతి సంవత్సరం ‘పరాక్రమ దివస్’గా జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయుల ప్రియతమ నేత, దేశం కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఆయన 125వ జయంతిని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2021 నుంచి ఆయన జయంతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘పరాక్రమ దివస్’గా నిర్వహించనున్నున్నట్లు తెలిపింది. యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నన్నట్లు వెల్లడించింది.
Government of India has decided to celebrate the birthday of Netaji Subhash Chandra Bose, on 23rd January, as 'Parakram Diwas' every year: Ministry of Culture pic.twitter.com/Cg0P8gjyFt
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న బెంగాల్లో పర్యటించనున్నారు. నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడే తొలి పరాక్రమ దినాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. అదే రోజున బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి నివాళిగా పాదయాత్ర నిర్వహించే యోచనలో ఉన్నారు. నేతాజీ జయంతిన దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని మమతా బెనర్జీ ఎప్పటి నుంచో డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన జయంతిని పరాక్రమ దివస్‌గా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది.
1897, జనవరి 23వ తేదీన ఒడిశాలోని కటక్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించారు. తల్లిదండ్రులు ప్రభావతీ బోస్, జానకీ నాథ్. చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించారు. అనంతరం రామకష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటం వైపు అడుగులు వేసి కీలక పాత్ర పోషించారు. గాంధీ అహింసా మార్గంతో బ్రిటిష్ వారు మాట వినరని.. సైనిక పద్దతిలోనే స్వాతంత్ర్యం సాధించాలని ఆకాంక్షించారు. అందుకోసం ఆజాద్ హిందూ ఫౌజ్‌ను సాధించారు. నేతాజీ ఒడిశాలో పుట్టినప్పటికీ.. పశ్చిమ బెంగాల్‌తో ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. కాగా, 2018 డిసెంబరులో అండమాన్ నికోబార్‌లోని రాస్ ఐలాండ్స్కు నేతాజీ పేరు పెట్టారు ప్రధాని మోదీ. తాజాగా ఆయన జయంతిని పరాక్రమ్ దివస్‌గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.