• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • NEETA AMBANI DOES NOT HAVE ANY OFFICIAL TWITTER HANDLE AND ALL TWITTER ACCOUNTS WITH HER NAME OR PHOTOGRAPH ARE FAKE SK

నీతా అంబానీ పేరుతో ట్విటర్‌లో ఫేక్ అకౌంట్స్.. ఖండించిన రిలయన్స్

ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌ బోర్డుకు ఎంపికైన నీతా అంబానీ. 150 ఏళ్ల మ్యూజియం చరిత్రలో తొలి భారతీయురాలిగా అరుదైన గౌరవం నీతా అంబానీ సొంతం.

నీతా పేరిట వైరల్ అవుతున్న ట్వీట్లపై ట్విటర్ ఇండియా విభాగానికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ట్విటర్ ఆయా నకిలీ అకౌంట్లను సస్పెండ్ చేసింది.

  • Share this:
    దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. కొందరు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. CAAకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఫేక్ ట్వీట్లు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ పేరిట పలు ట్వీట్లు ట్విటర్‌లో వైరల్‌గా మారాయి. కొందరు ఉద్దేశ్వపూర్వకంగా నీతా అంబానీ పేరిట CAAపై తప్పుడు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లపై రిలయన్స్ స్పందించింది. నీతా అంబానీ పేరిట ఎలాంటి అధికారిక ట్విటర్ హ్యాండిల్ లేదని స్పష్టం చేసింది. నీతా పేరిట వైరల్ అవుతున్న ట్వీట్లపై ట్విటర్ ఇండియా విభాగానికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ట్విటర్ ఆయా నకిలీ అకౌంట్లను సస్పెండ్ చేసింది.

    ''నీతా అంబానీ పేరిట ఉన్న ఓ ట్విటర్ ఖాతా నుంచి చాలా ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి నీతా అంబానీకి అధికారికంగా ఎలాంటి ట్విటర్ ఖాతా లేదు. ఆమె ఫొటోతో వాడుకలో ఉన్న ట్విటర్ ఖాతా నకిలీది. ఆ ఖాతాను ట్విటర్ నిలిపివేసింది.''అని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

    నీతా అంబానీ పేరుతో ఫేక్ అకౌంట్


    నీతా అంబానీ పేరుతో ఫేక్ అకౌంట్


    ఫేక్ అకౌంట్‌ను సస్పెండ్ చేసిన ట్విటర్
    Published by:Shiva Kumar Addula
    First published: