Supreme Court on NEET: నీట్ పరీక్షలో మార్పులపై కేంద్రాన్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు

Supreme Court on NEET: నీట్ పరీక్షలో మార్పులపై కేంద్రాన్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు (File Photo: Supreme Court)

NEET PG Super Speciality 2021 | నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ 2021 పరీక్షల సిలబస్ మార్పు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది.

  • Share this:
    నీట్ పీజీ పరీక్షల సిలబస్ మార్పులపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని తప్పుబట్టింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ 2021 పరీక్షల ప్యాటర్న్‌లో చివరి నిమిషంలో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ వైద్యులను ఫుట్‌బాల్‌లా చూడొద్దంటూ మండిపడింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ 2021 (NEET SS 2021) సిలబస్‌లో మార్పులకు కారణమైన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE), నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) పైనా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నితత్వం లేని అధికారుల దయపై యువ వైద్యులు ఉండలేరని, యువ డాక్టర్లను ఫుట్‌బాల్‌లా భావించకూడదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులైన డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Aadhaar-Ration card linking: ఆధార్‌ నెంబర్‌ను రేషన్ కార్డుతో లింక్ చేయాలా... ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రాసెస్ ఇదే

    నీట్ పీజీ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ 2021 నవంబర్ 13, 14 తేదీల్లో ఉంది. ఈ పరీక్ష తేదీలను జూలై 23న ప్రకటించింది బోర్డు. కానీ ఆగస్ట్ 31న సిలబస్‌లో మార్పులు చేశారు. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ మార్చడమేంటని, ఆ మార్పులేవో వచ్చే ఏడాది చేయొచ్చు కదా అని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఈ పరీక్షల కోసం కొన్ని నెలలుగా ప్రిపేర్ అవుతుంటారని, తాము అధికారుల తీరుపై అసంతృప్తిగా ఉన్నామన్నారు. మీకు అధికారం ఉంది కదా అని ఇలా అధికారం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
    Published by:Santhosh Kumar S
    First published: