Home /News /national /

NEET, JEE పరీక్షలను ఆపేయండి.. సుప్రీంకోర్టులో మంత్రుల పిటిషన్

NEET, JEE పరీక్షలను ఆపేయండి.. సుప్రీంకోర్టులో మంత్రుల పిటిషన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్, జేఈఈ పరీక్షలకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశారు. తీర్పును సమీక్షించి.. పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరారు మంత్రులు.

    NEET, JEE పరీక్షలపై తీవ్ర దుమారం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షలు నిర్వహించవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. తాజాగా బీజేపీయేతర ప్రభుత్వాలకు చెందిన ఆరుగురు మంత్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్, జేఈఈ పరీక్షలకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశారు. తీర్పును సమీక్షించి.. పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్‌లో కోరారు మంత్రులు.



    కాగా, షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు JEE మెయిన్స్, సెప్టెంబర్ 13న NEET పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంపుతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843కి పెంచారు. షిఫ్ట్‌ల సంఖ్యను కూడా 8 నుంచి 12 పెంచి.. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే వారి సంఖ్యను తగ్గించారు. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను 1.32 లక్షల నుంచి 85వేలకు తగ్గించారు. కాగా, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు 8.58 లక్షల మంది విద్యార్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: JEE Main 2020, NEET 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు