Home /News /national /

NEET 2021: ప్రాణం తీసిన భయం.. నీట్‌ ప‌రీక్ష‌ఫెయిల్ అవుతానని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

NEET 2021: ప్రాణం తీసిన భయం.. నీట్‌ ప‌రీక్ష‌ఫెయిల్ అవుతానని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

నీట్ ప‌రీక్ష ఫెయిల్ అవుతానేమోన‌ని భ‌యంతో ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకొంది. ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు జిల్లాలో జరిగింది. ఇప్పటికే సెప్టెంబర్ 12న పరీక్ష భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా... మరో ఘటన చోటు చేసుకోంది.

    ప‌రీక్ష భ‌యం.. మ‌రో విద్యార్థిని క‌బ‌లించింది. సెప్టెంబ‌ర్ 12న ధనుష్ అనే విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేడనే భయంతో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌(Fan)కు ఉరి వేసుకున్నాడు. ఈఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో విద్యార్థి నీట్ ప‌రీక్ష ఫెయిల్ అవుతానేమోన‌ని భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకొంది. తమిళనాడు(Tamil nadu)లోని అరియలూరు జిల్లాకు చెందిన కనిమొళి అనే విద్యార్థి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National eligibility cum entrance test) ప‌రీక్ష‌లో పాస్ కాలేనేమో అన్న భ‌యంతో ఆత్మ‌హ‌త్యం చేసుకొంది. కనిమొళి 12వ త‌ర‌గ‌తిలో బోర్డు ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు సాధించింది. మెడిక‌ల్ నీట్‌-2021(NEET-2021)  ప‌రీక్ష రాసింది. అయితే ప‌రీక్ష(Exam) రాసిన అనంత‌రం ఆమె ప‌రీక్ష‌లో మెరుగైన ఫ‌లితం రాదేమోన‌నే అనుమానం తండ్రికి చెప్పింది. అలా ఏమీ జ‌ర‌గ‌దు మంచి ఫ‌లితం వ‌స్త‌ది చూడు అని తండ్రి చెప్పినా.. క‌నిమొళీ ఈ అఘాయిత్యానికి పాల్ప‌డింది. వ‌రుగా ఇద్ద‌రు విద్యార్థులు ఆత్మహ‌త్య(Suicide) చేసుకోవ‌డంతో త‌మిళ‌నాడులో నీట్‌పై వ్య‌తిరేఖత ముదురుతోంది.

    కెరీర్ గైడెన్స్: నీట్ రాకుంటే.. నెక్ట్స్ ఏంటీ?


    త‌మిళ‌నాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్ర‌భుత్వం నీట్‌(NEET)ను వ్య‌తిరేకిస్తోంది. ఇప్ప‌టికే , డీఎంకే అసెంబ్లీ(Assembly)లో తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని కేంద్రాన్ని కోరడానికి ఒక బిల్లును ఆమోదించింది. ప‌లు పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌యంలో నీట్ రద్దు చేస్తామ‌న వాగ్దానాలు చేశాయి. నీట్ వ‌ల్ల గ్రామీణ విద్యార్థుల‌(Students)కు అన్యాయం జ‌రుగుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కంది. అసెంబ్లీలో అన్నాడీఎంకే, డీఎంకే రెండుపార్టీలు నీట్ ర‌ద్దుకు తీర్మానం చేశాయి. అయినీ నీట్ ర‌ద్దు కేంద్రం ప‌రిధిలోని అంశం కావ‌డంతో తీర్మానం వ‌ల్ల ప్ర‌యోజ‌నం చేకూర‌లేదు.

    నీట్ స‌మ‌స్య‌ల‌కు, స‌హాయానికి నీట్ దేశవ్యాప్తంగా ప‌లు సహాయ‌క కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. వాటి వివరాలు.. ఆస్రా (ముంబై) 022-27546669, స్నేహ (చెన్నై) 044-24640050, సుమైత్రి (ఢిల్లీ) 011-23389090, కూజ్ (గోవా) 0832- 2252525, జీవన్ (జంషెడ్‌పూర్ ) 065-76453841, ప్రతీక్ష (కొచ్చి) 048-42448830, మైత్రి (కొచ్చి) 0484-2540530, రోష్ని (హైదరాబాద్) 040-66202000, లైఫ్‌లైన్ 033-64643267 (కోల్‌కతా).
    Published by:Sharath Chandra
    First published:

    Tags: NEET 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు