మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ యూజీ 2020) దరఖాస్తు
తేదీని పొడగించారు. ఇదివరకు డిసెంబర్ 31,2019 వరకే గడువు ఉండగా.. ఇప్పుడు దాన్ని జనవరి 6 రాత్రి 11:50కు పొడిగించారు. వెబ్‌సైట్ ట్రాఫిక్ కారణంగా చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని దరఖాస్తుల గడువును మరో ఆరు రోజులు పొడగిస్తున్నట్టు వెల్లడించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఇదివరకు ప్రకటించినట్టుగానే జనవరి 15 నుంచి జనవరి 31 వరకు గడువు ఉంటుందని తెలిపింది. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంపిక చేసిన నోడల్ సెంటర్స్‌లో జమ్మూకాశ్మీర్,లేహ్ కార్గిల్‌లో నివాసం ఉంటున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NEET 2020